అవినీతిపై పోరాటం చేయాలి
పర్లాకిమిడి: అవినీతికి వ్యతిరేకంగా పోరాటం చేయాలని స్థానిక మహిళా డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్ రీనాసాహు అన్నారు. అవినీతి నివారణ వారోత్సవాల సందర్భంగా కళాశాలలో చైతన్య సమావేశాన్ని బుధవారం ఏర్పాటు చేశారు. ఎన్ఎస్ఎస్ అధికారిని మధుస్మితా ప్రధాన్, యువరెడ్క్రాస్ అధికారి క్రిష్ణచంద్ర పండిట్ కార్యక్రమంలో పాల్గొన్నారు. దేశం, రాష్ట్రం అభ్యున్నతికి, అవినీతి రహిత పాలన అందించేందుకు ప్రతి ఒక్కరూ లంచానికి దూరంగా ఉండాలని ఎన్ఎస్ఎస్ అధికారి మధుస్మితా ప్రధాన్ పిలుపునిచ్చారు. అవినీతికి దూరంగా ఉంటామని విద్యార్థులు, అధ్యాపకులచే ప్రతిజ్ఞ చేయించారు.
Comments
Please login to add a commentAdd a comment