బీఎస్ఎన్ఎల్ కార్యాలయంలో మంటలు
జయపురం: కొత్తవీధి బైపాస్ రోడ్డులోని బీఎస్ఎన్ఎల్ అడ్మినిస్ట్రేటివ్ కార్యాలయంలో బుధవారం అగ్ని ప్రమాదం సంభవించింది. ఈ ఘటనలో రికార్డులు, సామగ్రి కాలిపోయాయి. విషయం తెలుసుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. ఈ ఘటనలో సుమారు రూ.10 లక్షల నష్టం వాటిల్లినట్లు అంచనా. ప్రమాదానికి గల కారణాలు తెలియలేదు. అయితే దుండగులు వైర్లు దొంగిలించేందుకు ఈ ఘటనకు పాల్పడి ఉంటారని కొరాపుట్ బిఎస్ఎన్ఎల్ బిజినెస్ ఏరియా డీజీఎం రంజిత్‌కుమార్ సాహు అభిప్రాయపడ్డారు. బీఎస్ఎన్ఎల్ ఉన్నతాధికారులు విచారణ చేపడుతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment