No Headline
నబరంగ్‌పూర్ జిల్లా గిరిజన సాంస్కృతిక ఉత్సవం మండయ్–2024 బుధవారం ఘనంగా ప్రారంభమైంది. ముందుగా నందాహండి సమితి డొండ్ర గ్రామంలోని జడేశ్వర శివ మందిరం వద్ద ర్యాలీని రాష్ట్ర సాంఘిక సంక్షేమ, విద్యా శాఖ మంత్రి నిత్యానంద గొండో ప్రారంభించారు. గిరిజన మహిళలు సంప్రదాయ నృత్యాలు చేస్తుండగా ర్యాలీ ముందుకు సాగింది. కలెక్టర్ డాక్టర్ శుభంకర్ మహాపాత్రో, ఎమ్మెల్యేలు గౌరీశంకర్ మజ్జి (నబరంగ్‌పూర్), మనోహర్ రందారి (డాబుగాం), నర్సింగ్ బోత్ర (జొరిగాం), జిల్లా పరిషత్ అధ్యక్షుడు మొతిరాం నాయక్‌లు గిరిజనులతో కలిసి సందడి చేశారు. అనంతరం మండయ్ జ్యోతిని సమీప జాడేశ్వర్ శివ మందిరంలో వెలిగించారు. అనంతరం మండయ్ పోస్టర్‌ను ప్రముఖులు ఆవిష్కరించారు. కాగా, ఈ జ్యోతిని జిల్లా వ్యాప్తంగా ఊరేగించనున్నారు. ఉత్సవాలు పంచాయతీ, సమితి, చివరకు జిల్లా స్థాయిలో జరగనున్నాయి.
– కొరాపుట్
Comments
Please login to add a commentAdd a comment