మృత్యువులోనూ వీడని బంధం
కొరాపుట్: ఆ దంపతులను మృత్యువు వెంటాడింది. రైల్వేట్రాక్ దాటుతుండగా రెండు రైళ్లు వేర్వేరు ట్రాకుల నుంచి ఒకేసారి దూసుకురావడంతో ఎటు వెళ్లాలో తెలియక అయోమయానికి గురయ్యారు. ఈ క్రమంలో రైలు ఢీకొనడంతో అక్కడికక్కడే మృతిచెందారు. ఈ విషాద ఘటన బుధవారం కొరాపుట్ జిల్లా లక్ష్మీపూర్ రైల్వే స్టేషన్కు కిలోమీటరు దూరంలో ఉన్న బుయిపట్న గ్రామ సమీపంలో చోటుచేసుకుంది. ఇదే సమితిలోని బుర్జా గ్రామానికి చెందిన బురస ఖోర (60), జమున ఖోర (59) గిరిజన గ్రామాల్లో ఎండు చేపలు అమ్మకం చేస్తుంటారు. ఎప్పట్లాగే బుధవారం కూడా చేపలు అమ్మేందుకు వెళ్లి రైల్వే ట్రాక్ దాటుతుండగా డీఎంయూ రైలు ఒక వైపు, గూడ్స్ రైలు మరోవైపు ఒకేసారి వచ్చాయి. ట్రాక్ పై ఉండగా ఎటువైపు వెళ్లాలో తెలియని సమయంలో డీఎంయూ రైలు దంపతులను ఢీకొట్టుకుంటూ వెళ్లిపోయింది. దీంతో ఇద్దరూ ఘటనా స్థలంలోనే మృతిచెందారు. విషయం తెలుసుకున్న రైల్వే అధికారుల, పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు ప్రారంభించారు.
రైలు ఢీకొని దంపతుల మృత్యువాత
ట్రాక్ దాటుతుండగా దూసుకొచ్చిన
రెండు రైళ్లు
Comments
Please login to add a commentAdd a comment