41 ఎకరాలలో గంజాయి పంట ధ్వంసం
కొరాపుట్: కొరాపుట్ జిల్లాలో 41 ఎకరాల్లో అక్రమంగా సాగవుతున్న గంజాయి పంటను అధికారులు గుర్తించి బుధవారం ధ్వంసం చేశారు. నందపూర్ సమితి పాడువ పోలీస్‌స్టేషన్ పరిధిలో శిఖరపుట్, బి.మాలిపుట్ గ్రామాల మధ్య అటవీ ప్రాంతంలో సాగవుతున్న గంజాయి పంటను గుర్తించారు. ఎకై ్సజ్, డీవీఎఫ్, పోలీసులు సంయుక్తంగా గంజాయి మొక్కలను నరికి తగలబెట్టారు. సుమారు 57,400 గంజాయి మొక్కలన ధ్వంసం చేసినట్టు అధికారులు ప్రకటించారు.
మత్తిలి సమితిలో 24 ఏకరాల్లో..
మల్కన్‌గిరి: మల్కన్‌గిరి జిల్లా మత్తిలి సమితి మడ్కపోధర్ పంచాయతీ శుక్రీపూట్ గ్రామం అడవీ ప్రాంతంలో సాగవుతున్న గంజాయి తోటలను ఎకై ్సజ్ పోలీసులు బుధవారం గుర్తించారు. ఈ సందర్భంగా 24 ఏకరాల్లో సాగవుతున్న గంజాయి తోటలను ధ్వంసం చేశారు. మొత్తం 36 వేల గంజాయి మొక్కలను తొలగించి కాల్చివేశారు. దీని విలువ మూడు కోట్ల ఆరవై వేల రూపాయలు ఉంటుందని ఎకై ్సజ్ డిప్వూటీ ఇన్‌స్పెక్టర్ టంకధర్ భోయి తెలిపారు. ఈ ఘటనపై మత్తిలి ఎకై ్సజ్ పోలీసుస్టేషన్‌లో కేసు నమోదు చేశారు. అలాగే గంజాయి తోటలను సాగు చేస్తున్న భూమి ఎవరిదో పూర్తిస్థాయిలో దర్యాప్తు చేయాలని రెవెన్యూశాఖ అధికారులను అదేశించారు. దర్యాప్తు అనంతరం భూమికి చెందిన వ్యక్తులపై చర్యలు తీసుకుంటామన్నారు. దాడిలో ఎకై ్సజ్ ఇన్‌స్పెక్టర్ సతీష్ కుమార్ బాల, సబ్ ఇన్‌స్పెక్టర్ అషితా కుమార్, నాయక్, దీలిప్ కుమార్ సమాల్, ఏఎస్‌ఐ రామ్‌చంద్రహంతాల్ తదితరులు ఉన్నారు.
Comments
Please login to add a commentAdd a comment