భువనేశ్వర్: రాష్ట్ర ఉన్నత మాధ్యమిక విద్యా మండలి సీహెచ్‌ఎస్‌ఈ ఆధ్వర్యంలో జరగనున్న +2 శ్రేణి వార్షిక పరీక్షల టైం టేబుల్‌ను అధికారులు విడుదల చేశారు. వచ్చే ఏడాది ఫిబ్రవరి నెల 18 నుంచి మార్చి నెల 27వ తేదీ వరకు పరీక్షలు జరుగుతాయి. ఈ వ్యవధిలో +2 శ్రేణి ఆర్ట్స్, సైన్స్, కామర్స్, వృత్తి విద్యా కోర్సుల పరీక్షలు నిర్వహిస్తారు. ఈ విభాగాల రెగ్యులర్, ఎక్స్ రెగ్యులర్ అభ్యర్థులకు ఒకేసారి వార్షిక పరీక్షలు జరుగుతాయని సీహెచ్‌ఎస్‌ఈ ప్రకటించింది. థియరీ పరీక్ష నిడివి మూడు గంటలుగా పేర్కొంది. అలాలే ఇంటర్నల్ అసెస్‌మెంటు, ప్రాజెక్టు వర్గం పరీక్షలు ఈ నెల 23 నుంచి 30వ తేదీ వరకు జరుగుతాయి. ఇంటర్నల్ అసెస్‌మెంటు నిడివి 45 నిమిషాలు కాగా ప్రాజెక్టుల నిడివి 2 గంటలుగా ప్రకటించారు.
జనవరి 2 నుంచి ప్రాక్టికల్ పరీక్షలు..
జనవరి నెల రెండు నుంచి 12వ తేదీ వరకు ప్రాక్టికల్ పరీక్షలు జరుగుతాయి. ఈ పరీక్షల నిడివి రెండు నుంచి మూడు గంటలు ఉంటుంది. విద్యార్థులు పరీక్షకు కనీసం అర గంట ముందుగా కేటాయించిన కేంద్రానికి చేరాల్సి ఉంటుంది. పరీక్ష ఆరంభానికి కనీసం పావు గంట ముందుగా పరీక్ష హాలులో హాజరు కావాలని మండలి పేర్కొంది. పరీక్షలను కట్టుదిట్టంగా నిర్వహించేందుకు సీసీటీవీ నిఘా ఉంటుంది. ఈ వ్యవస్థ పకడ్బందీగా నిర్వహించే బాధ్యతని పరీక్ష కేంద్రం సూపరింటెండెంట్లకు అప్పగించారు.
Comments
Please login to add a commentAdd a comment