గజపతి జిల్లాలో పడిపోయిన ఉష్ణోగ్రతలు
పర్లాకిమిడి: గజపతి జిల్లాలో ఏజెన్సీ ప్రాంతాలైన మోహానా, చంద్రగిరి, మహేంద్రగడ, రామగిరి, ఆర్.ఉదయగిరిలలో నాలుగు రోజులుగా ఉష్ణోగ్రతలు పడిపోయాయి. పగటి పూట ఎండకాస్తున్నప్పటికీ సాయంత్రం నాలుగు గంటల నుంచి ఆర్.ఉదయగిరి, మహేంద్రగడ, మోహానా, చంద్రగిరిలో మంచు కురుస్తున్నది. బుధవారం చంద్రగిరి, మోహానా, సరిహద్దు ఫుల్భాణీలో 18 డిగ్రీల చొప్పున ఒడిశాలో ఫుల్భానీ జిల్లా దరింగిబడిలో 16 డిగ్రీల పగటి పూట ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. రాబోయే రోజుల్లో పగటి పూట ఉష్ణోగ్రతలు 15 డిగ్రీలకు ఉష్ణోగ్రతలు పడిపోతాయని ఐఎండీ మాజీ డైరెక్టర్ డాక్టర్ శరత్ చంద్ర సాహు తెలిపారు. ఈనెల 24న తమిళనాడులో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉండడంతో దక్షిణ ఒడిశాలో చలితీవ్రత మరింత పెరిగే అవకాశం ఉందన్నారు.
ఉన్ని దుస్తులకు గిరాకీ
చలితీవ్రత పెరగడంతో జనం వెచ్చదనాన్ని ఇచ్చే ఉన్ని దుస్తులు కొనుగోలుకు ఆసక్తి చూపుతున్నారు. దీంతో పర్లాకిమిడిలోని పలు ప్రాంతాల్లో వీటి విక్రయాలు ప్రారంభమయ్యాయి. జనంఉన్ని దుస్తులు కొనుగోలు చేస్తూ చలినుంచి రక్షించుకుంటున్నారు.
Comments
Please login to add a commentAdd a comment