భువనేశ్వర్: రాష్ట్రంలో అక్రమ మద్యం తయారీ, పంపిణీ, విక్రయం వంటి కార్యకలాపాల్ని పూర్తిగా అణచి వేసేందుకు ప్రభుత్వం కంకణం కట్టుకుందని అబ్కారి శాఖ మంత్రి పృథ్వీ రాజ్ హరిచందన్ శుక్ర వారం తెలిపారు. రాష్ట్రంలో ఇటీవల తరచూ తలెత్తుతున్న అక్రమ మద్యం రవాణా, కల్తీ సారా మృతులు వంటి సంఘటనలతో ప్రభుత్వం ఘాటుగా స్పందించి ఈ మేరకు నిర్ణయించినట్లు మంత్రి వివరించారు. అక్రమ మద్యం డిస్టిలరీలు ఇతర తయారీ స్థావరాలపై నిఘా వేసి ఉత్పాదన, పంపిణీ, విక్రయాల లావాదేవీల్ని మూలాలతో తొలగిస్తామని మంత్రి హామీ ఇచ్చారు. ఆయా ప్రాంతాలపై తమ విభాగం నిరంతరం నిఘా వేసి ఉంటుందన్నారు. అక్రమ మద్యం అణచి వేత పురస్కరించుకుని చట్ట సంస్కరణ సోపానంగా ప్రభు త్వం నిర్ధారించింది. ఈ దిశలో చర్యలు చేపట్టేందు కు అనుబంధ వర్గాల నిపుణులు, అనుభవజ్ఞులతో విభాగం ప్రత్యక్షంగా సంప్రదింపులు జరుపుతుంది. వీరి సలహాలు, మార్గదర్శకాలి క్రోడీకరించి చట్ట సంస్కరణలు చేపట్టనున్నారు.
మాదక ద్రవ్యాల రవాణాపై నిఘా
రాష్ట్రంలో మాదక ద్రవ్యాల లావాదేవీల్ని విభాగం అరికడుతోంది. నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో ఎన్‌సీబీ, అబ్కారి విభాగాన్ని సమన్వయ పరచి వ్యూహాత్మక కార్యాచరణకు తుది మెరుగులు దిద్దుతోందని విభాగం మంత్రి పృథ్వి రాజ్ హరిచందన్ తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా మాదక ద్రవ్యాల అక్రమ రవాణా ముఠాల్ని మట్టుబెట్టడం లక్ష్యంగా పేర్కొన్నారు.
బీజేడీ పార్లమెంటరీ సమావేశం
భువనేశ్వర్: భారత పార్లమెంటు శీతాకాలం సమావేశాలను పురస్కరించుకుని బిజూ జనతా దళ్ పార్లమెంటు సభ్యులు సమావేశమయ్యారు. స్థానిక నవీన్ నివాస్‌లో బీజేడీ అధ్యక్షుడు నవీన్ పట్నాయక్ అధ్యక్షతన ఈ సమావేశం శుక్రవారం జరిగింది. త్వరలో ప్రారంభం కానున్న పార్లమెంటు శీతాకాలం సమావేశంలో పార్టీ వైఖరిపై సభ్యులకు అవగాహన కల్పించారు.
జవాన్ మృతితో విషాదం
సోంపేట: మండలంలోని తురకశాసనాం గ్రామానికి చెందిన ఆర్మీ జవాన్ వెదుళ్ల నాగేశ్వరరావు (58) గురువారం అరుణాచల్‌ప్రదేశ్‌లో గుండెపోటుతో మృతి చెందారు. ఈయన 28 ఏళ్లుగా జిఆర్‌ఈఎఫ్‌లో విధులు నిర్వహిస్తున్నారు. విధి నిర్వహణలో ఉండగా గుండెపోటు రావడంతో వైద్యసేవలు అందజేసినా ఫలితం లేకపోయింది. మృతదేహాన్ని శుక్రవారం గ్రామానికి తీసుకొచ్చి పోలీసు లాంఛనాలతో అంత్యక్రియలు పూర్తి చేశారు. నాగేశ్వరరావుకు భార్య కమలమ్మ, కుమారుడు ఆకాష్, కుమార్తె అనూష ఉన్నారు. కుమార్తెకు వివాహం కాగా, కుమారుడు ఆర్మీలోనే విధులు నిర్వహిస్తున్నాడు. నాగేశ్వరరావు మృతితో గ్రామంలో విషాదఛాయలు అలముకున్నారు.
Comments
Please login to add a commentAdd a comment