నేడే ప్రథమాష్టమి
లింగరాజు యాత్ర
భువనేశ్వర్ లింగరాజు మహా ప్రభువు ప్రథమాష్టమి వేడుకని యాత్రగా జరుపుకోవడం విశేషం. ఈ తిథి నాడు మహా ప్రభువు మేన మామ సన్నిధికి తరలి వెళ్తాడు. స్థానిక కపాలి మఠం లింగ రాజు మహా ప్రభువు మేనమామ సన్నిధి. ఈ సన్నిధి ఆరాధ్య దైవం వరుణేశ్వర్, బలదేవ్. ఈ మఠం ప్రాంగణంలో పాపనాశిని పుష్కరిణి ఉంటుంది. ప్రథమాష్టమి పురస్కరించుకుని ఈ పుష్కరిణి జలం స్వీకరిస్తే సకల పాపాలు తొలగిపోతాయని నమ్ముతారు.
తాంత్రిక ప్రాముఖ్యత
ప్రథమాష్టమి తాంత్రికంగా ప్రాముఖ్యత సంతరించుకుంది. తంత్ర సాధకులకు ఈ రాత్రి అత్యంత కీలకం. తాంత్రిక సంప్రదాయంలో ఘోర రాత్రిగా పేర్కొంటారు. ఈ తిథి నాడు ఆది శక్తి కాల రాత్రి రూపంలో అవతరించినట్లు తాంత్రిక వర్గీయులు పరిగణిస్తారు.
Comments
Please login to add a commentAdd a comment