8 క్వింటాళ్ల గంజాయి పట్టివేత
జయపురం: జయపురం సబ్‌డివిజన్ బొరిగుమ్మ సమితి బైరవ సింగపూర్(బి.సింగపూర్) పోలీసు స్టేషన్ పరిధి ముంజకంగారుగుడ గ్రామ సమీపంలోని ఒక ఫాం హౌస్‌లో పోలీసులు 8 క్వింటాళ్ల గంజాయిని పట్టుకున్నారు. అక్కడ ఆరుగురిని అరెస్టు చేసినట్లు బొరిగుమ్మ సబ్‌డివిజన్ పోలీసు అధికారి తపశ్విణీ కొహర్ శనివారం వెల్లడించారు. గంజాయి వ్యవహారంలో ప్రధాన నిందితుడు పరారీలో ఉన్నట్లు వెల్లడించారు. బి.సింగపూర్ పోలీసుస్టేషన్ ముంజకంగారుగుడ గ్రామ సమీపంలో గజపతి జిల్లా ఆర్.ఉదయగిరి గ్రామం దీపు బెహరా ఫార్మ్ హౌస్ నిర్వహిస్తున్నారని వెల్లడించారు. ఆ ఫార్మ్ హౌస్‌లో సీజనల్ పంటల వ్యాపారం చేస్తున్నారు. స్థానిక రైతుల నుంచి మొక్క జొన్న, చింతపండు, ధాన్యం, చోళ్లు కొనుగోలు చేస్తున్నట్లు పోలీసు అధికారి వెల్లడించారు. వాటిని ఆయన ఇతర రాష్ట్ర వ్యాపారులకు అమ్ముతున్నారు. వాటితో పాటు గంజాయి ప్యాకెట్లు కూడా సప్లై చేస్తున్నాడని పోలీసు అధికారి వెల్లడించారు. ఈ విషయం తెలుసుకుని ఫార్మ్ హౌస్‌పై దాడి చేశామన్నారు. గంజాయిని మెజిస్ట్రేట్ సమక్షంలో తూయించగా 8 క్వింటాళ్లు ఉన్నట్లు వెల్లడైందని వెల్లడించారు. కానీ దీపు పరారయ్యాడని తెలిపారు. దీపు బెహర తండ్రితో పాటు అక్కడ పనిచేస్తున్న మరో ఐదుగురు వ్యక్తులను అరెస్టు చేసినట్లు తెలిపారు. ఈ దాడిలో బి.సింగపూర్ పోలీసు అధికారి సంబిత్ కుమార్ స్వయ్, పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment