న్యాయవాదుల నిరసన
● న్యాయవాదిపై యాసిడ్ దాడి చేసిన నిందితులను అరెస్టు చేయాలని డిమాండ్ ● జిల్లా ఎస్పీకి బార్ అసోసియేషన్ ప్రతినిధుల వినతి
పర్లాకిమిడి: న్యాయవాది పత్తి రామారావుపై యాసి డ్ దాడి కేసులో పోలీసులు ఇప్పటివరకూ నిందితుల్ని పట్టుకోలేక పోయారని నిరసిస్తూ బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో సోమవారం నిరసన కార్యక్రమం చేపట్టారు. జిల్లా కోర్టు వద్ద నుంచి పర్లాకిమిడి బార్ అసోసియేషన్ పట్టణంలో ర్యాలీ జరిపారు. ఈ సందర్భంగా పోలీసులకు వ్యతిరేకంగా అడ్వకేట్లు కోర్టు విధులను బహిష్కరించి, నినాదాలు చేస్తూ కలెక్టరేట్, మోడల్ పోలీసుస్టేషన్, పెద్ద మార్కెట్, కొత్త బస్టాండు మీదుగా రాణిపేటలో ఉన్న జిల్లా ఎస్పీ కార్యాలయం వరకూ మోటారు సైకిల్ ర్యాలీ జరిపారు. అనంతరం జిల్లా ఎస్పీ జితేంద్రనాథ్ పండాకు గౌరవ రాష్ట్రపతి, ఒడిశా గవర్నరు రఘువరదాస్, సీఎం మోహన్ చరణ్ మాఝి, రాష్ట్ర న్యాయశాఖ మంత్రి హారిచందన్‌కు యడ్రస్ చేస్తూ రాసిన వినతిని బార్ అసోసియేషన్ అధ్యక్షులు స్వరూప్ కుమార్ పాలో సమర్పించారు. న్యాయవాదులకు రక్షణ కల్పిస్తూ చట్టం అమలు వెంటనే జరపాలని బార్ అసోసియేషన్ డిమాండు చేశారు. అనంతరం కలెక్టర్ కార్యాలయంకు ర్యాలీగా వెళ్లి జిల్లా పాలనాధికారి బిజయకుమార్ దాస్‌కు వినతిని అందజేశారు. ర్యాలీలో బార్ అసోసియేషన్ కార్యదర్శి రామకృష్ణ నాయక్, జాయింట్ సెక్రటరీ నీలమాధవ్ అధికారి, ఉపాధ్యక్షులు శిశిర్ కుమార్ జెన్నా, సీనియర్ న్యాయవాదులు హీరాచంద్, ముల్లి గోపాలరావు, ప్రభుత్వ పీపీ వి.ఎస్.ఎన్.రాజు, పృద్వీరాజ్, రౌతు ఉదయచంద్రరావు, కై లాష్ చంద్ర గౌడో, శైలాడ శ్రీరాములు, రామనాథ్, పంటల ప్రసాదరావు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment