ఘనంగా దివ్యాంగుల దినోత్సవం
జయపురం: దివ్యాంగులకు సమాజంలో సముచిత స్థానం కల్పించేందుకు సామూహిక ఉద్యమం అవసరమని కొరాపుట్ జిల్లా విద్యా విభాగ విద్యాధికారి ప్రమోద్ కుమార్ ముండ అన్నారు. మంగళవారం స్థానిక నెహ్రూ నగర్లో సిటీ హైస్కూలు ప్రాంగణం నిర్వహించిన అంతర్జాతీయ దివ్యాంగుల దినోత్సవంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. దివ్యాంగుల హక్కులు, రక్షణ, సంక్షేమం పరిరక్షణ వంటి అంశాలపై మాట్లాడారు. సభకు ముందు ఉపాధ్యాయురాలు సుభశ్రీ పాత్రో నేతృత్వంలో విద్యార్థులు ర్యాలీ చేశారు. ఈ సందర్భంగా విద్యార్థులకు పలు పోటీలు నిర్వహించి విజేతలకు బహుమతులు అందజేశారు.
Comments
Please login to add a commentAdd a comment