‘అంగవైకల్యం మనసుకు కాదు’
పర్లాకిమిడి: అంగవైకల్యం శరీరానికి కానీ మనస్సుకు కాదని కలెక్టర్ బిజయకుమార్ దాస్ అన్నారు. స్థానిక బిజూ కల్యాణ మండపంలో మంగళవారం జరిగిన అంతర్జాతీయ దివ్యాంగుల దినోత్సవంలో ఆయన ముఖ్యఅతిథిగా పాల్గొని మాట్లాడారు. కార్యక్రమంలో డీఆర్‌డీఏ ముఖ్యకార్యనిర్వాహణ అధికారి గుణనిధి నాయక్, సీడీఎంఓ డాక్టర్ మహమ్మద్ ముబారక్ ఆలీ, సీసీడీ సంస్థ అధ్యక్షులు అడ్డాల జగన్నాధ రాజు, డీఎస్‌ఎస్‌ఓ సంతోష్ కుమార్‌నాయక్, సబ్‌కలెక్టర్ అనుప్ పండా, సమర్థ్ దివ్యాంగుల సంస్థ అధ్యక్షులు సంతోష్ మహారాణా పాల్గొన్నారు. గజపతి జిల్లాలో 1200 మంది దివ్యాంగులు ఉన్నారని, ఇప్పటివరకూ యు.ఐ.ఐ.డీ నమోదు ప్రక్రియ చేయించుకోకుండా ఉన్నవారు త్వరితగతిన ఆన్‌లైన్‌లో పూర్తి చేసుకుని ప్రభుత్వం అందిస్తున్న ప్రోత్సాహకాలు పొందాలని జిల్లా సామాజిక భధ్రతా అధికారి సంతోష్ కుమార్‌నాయక్ అన్నారు. ప్రత్యేక పరికరాల కోసం దరఖాస్తు చేసుకోవాలని కలెక్టర్ సూచించారు. కార్యక్రమంలో నువాగడ బ్లాక్‌కు చెందిన భీంసేన్,అయితా మండల్ దివ్యాంగ దంపతులకు వివాహ ప్రోత్సాహాకం క్రింద రూ.రెండున్నర లక్షలు, గుమ్మాబ్లాక్‌కు చెందిన నారాయణ లిమ్మా దంపతులకు రూ.రెండున్నర లక్షల చెక్కు, మరో దివ్యాంగ వృద్ధురాలికి బైక్ అందజేశారు. అనంతరం కటక్ రెవెన్షా కళాశాలలో చదువుతున్న గజపతి జిల్లా వాసికి బ్రెయిలీ ల్యాప్‌టాప్‌ను అధికారులు అందజేశారు. కార్యక్రమంను సబ్‌డివిజన్ దివ్యాంగ భధ్రతాధికారి ఉత్సర్‌గీతా బడరయితో ముఖ్యవక్తగా వ్యవహరించారు.
Comments
Please login to add a commentAdd a comment