నూతన కార్యవర్గం ఏర్పాటు
రాయగడ: జిల్లాలో కాసీపూర్ సమితిలోని వివిధ ప్రభుత్వ పాఠశాలల్లో పనిచేస్తున్న జూనియర్ ఉపాధ్యాయుల సంఘం కొత్త కార్యవర్గాన్ని మంగళవారం ఎన్నుకున్నారు. కాసీపూర్‌లోని హనుమాన్ మందిరం ప్రాంగణంలో జరిగిన ప్రత్యేక సమావేశంలో కొత్త కార్యవర్గాన్ని ప్రకటించారు. సంఘం అధ్యక్షుడిగా సునాముఖి తురుక్, కార్యదర్శిగా బిజయలక్ష్మీ జెన్న, ఉపాధ్యక్షుడిగా రాజేంద్ర బలొ, సహ కార్యదర్శిగా ముకుంద సబర్, కోశాధికారిగా తాపస్ రంజన్ బెహర, క్లస్టర్ కన్వీనర్లుగా దీపక్ ఘొష్, ఇంద్ర కుమార్ నాయక్, సరోజ్ కుమార్ నాయక్‌లు నియమితులయ్యారు. ఉపాధ్యాయుల సమస్యలకు సంబంధించి సమావేశంలో చర్చించారు.
Comments
Please login to add a commentAdd a comment