ఏడోమైలు వద్ద పులి సంచారం..?
పర్లాకిమిడి: గుసాని సమితి ఏడో మైలు దారి బాగుసల గ్రామం వద్ద గత రాత్రి పెద్ద పులి సంచరించినట్టు పాదముద్రల ద్వారా గ్రామస్తులు గమనించారు. అయితే దీనిపై నారాయణపూర్ దేవగిరి రేంజ్ అధికారి బ్రహ్మానంద సాహు ఇప్పటివరకూ ధ్రువీకరించలేదు. పెద్ద పులి సంచారంపై వస్తున్న పలు కథనాలుపై డీఎఫ్‌ఓ సుబ్రహ్మాణ్యం ఆనంద్ మాట్లాడుతూ, ఏడోమైలు, బాగుసల గ్రామ పరిసర ప్రాంతాల్లో దేవగిరి అటవీ సిబ్బంది మంగళవారం సాయంత్రం గ్రామంలో హెచ్చరికలు జారీ చేశారు. పెద్దపులి కదలికలపై దేవగిరి రేంజ్ అధికారులు మంగళవారం ట్రాకింగ్ కెమెరాలు అమర్చుతున్నారు. గత ఏడాది డిసెంబరులో రాయఘడ, నువాగడలో తిరిగిన పెద్ద పులి తిరిగి ఈ ప్రాంతంలో తిరుగుతోందని ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు. బాగుసల అటవీ ప్రాంతంలో పెద్ద పులి అడుగుజాడలను అటవీ అధికారులు పరిశీలిస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment