ఐదు కొండలు దాటితేనే కడుపు నిండేది | - | Sakshi
Sakshi News home page

ఐదు కొండలు దాటితేనే కడుపు నిండేది

Published Wed, Dec 4 2024 1:08 AM | Last Updated on Wed, Dec 4 2024 1:08 AM

ఐదు కొండలు దాటితేనే కడుపు నిండేది

ఐదు కొండలు దాటితేనే కడుపు నిండేది

ఐదు కిలోల బియ్యం కావాలంటే ఐదు కొండలు దాటాల్సిన దుస్థితి వారిది. కొరాపుట్‌ జిల్లాలోని నారాయణ పట్న సమితిలో సుడిసి గ్రామంలో 45 కుటుంబాలు నివసిస్తున్నాయి. ఈ గ్రామానికి రహదారి లేకపోవడంతో ప్రభుత్వ పథకాలు అందడం లేదు. ప్రభుత్వం అందించే 5 కేజీల సంక్షేమ పీడీఎస్‌ బియ్యం కోసం గిరిజనులు ప్రతి నెల ఉదయం 8 గంటలకు ఇంటి నుంచి బయల్దేరి 5 కొండలు దాటి ప్రమాదకర మార్గంలో నడుస్తూ తిరిగి రాత్రి 8 గంటలకు ఇళ్లకు చేరుకుంటారు. ఈ మార్గంలో ద్విచక్ర వాహనం కూడా వెళ్లలేదు. ఒకప్పుడు ఈ గ్రామ పరిసరాలు మావోయిస్టుల ఖిల్లా గా ఉండేవి. ప్రస్తుతం మావోయిస్టులు ప్రభావం లేక పోయినా ప్రభుత్వ అధికారులు ఏనాడూ రావడం లేదు. దీంతో వీరికి ‘నడక’యాతన తప్పడం లేదు. – కొరాపుట్‌

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement