విద్యార్థులకు పౌష్టికాహారం పంపిణీ
రాయగడ: జిల్లాలోని చంద్రపూర్ సమితి కమిపొదొరొ ప్రాథమిక పాఠశాల విద్యార్థులకు పౌష్టికాహారం పంపిణీ కార్యక్రమం మంగళవారం జరిగింది. పాఠశాల హెచ్‌ఎం నవీన్ కుమార్ నందో అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో బీజాపూర్ పంచాయతీ సర్పంచ్ జెరిమన పొడగండ, పాఠశాల పరిచాలన కమిటీ అధ్యక్షుడు ప్రదీప్ బిఆస్కా తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా సర్పంచ్ జెరిమాన మాట్లాడుతూ విద్యార్థుల్లో పౌష్టికాహారం లోపిస్తే చదువుపై శ్రద్ధ తగ్గిపోతుందని, వారిలో మానసిక ఉత్సాహం కరువవుతుందని పేర్కొన్నారు. అందువలన సకాలంలో పౌష్టికాహారం అందేలా చర్యలు తీసుకోవాలని కోరారు.
Comments
Please login to add a commentAdd a comment