రూ.3.5కోట్ల విలువైన గంజాయి పంట ధ్వంసం
జయపురం: జయపురం సబ్‌డివిజన్ బొయిపరిగుడ సమితి మఠపడ, రామగిరి పోలీసు పంటి పరిది బాఘఖద్ర, భెండియజొడి, డెంగపకన్ ప్రాంతాల్లో చట్ట వ్యతిరేకంగా పండిస్తున్న గంజాయి పంట పొలాలపై దాడులు జరిపినట్లు బొయిపరిగుడ పోలీసు అధికారి దీపాంజళి ప్రధాన్ సోమవారం తెలిపారు. ఆపరేషన్ గ్రీన్ క్లీన్ అభిజాన్‌లో నిర్వహించిన దాడుల్లో 31 ఎకరాలలో పండించిన గంజాయి పంటను గుర్తించి వాటిని ఒక చోట చేర్చి తగుల బెట్టినట్లు ఆమె వెల్లడించారు. 31 ఎకరాల్లో బాగా పండిన 31,500 గంజాయి మొక్కలను పోలీసు సిబ్బంది తగలబెట్టారు. ఈ గంజాయి విలువ రూ.3 కోట్ల 50 లక్షలకు పైనే ఉంటుందని పోలీసు అధికారి వెల్లడించారు. బొయిపరిగుడ సమితి బాఘఖద్ర, భెండియజొడి, డెంగపకన్ ప్రాంతాల్లో గంజాయి విస్తృతంగా పండిస్తున్నట్లు సమాచారం పోలీసులకు అందిందని ఆమె వెల్లడించారు
Comments
Please login to add a commentAdd a comment