తెలుగు తల్లికి నైవేద్యం
కుసుమంచి పద్యం..
● రచయిత భళ్లమూడి నాగరాజు
రాయగడ: విజయనగరం పట్టణానికి చెందిన ప్రముఖ రచయిత్రి కుసుమంచి శ్రీదేవి రచించిన కుసుమంచి పలుకు శతకము తెలుగు తల్లికి నైవేద్యం వంటిదని సీనియర్ పాత్రికేయుడు, రచయిత భళ్లమూడి నాగరాజు అన్నారు. స్థానిక రాజ్‌భవన్ సమావేశం హాల్‌లో ఆదివారం సాయంత్రం రాయగడ రచయితల సంఘం (రారసం) వారు నిర్వహించిన సాహితీ సదస్సుకు ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. ఎంఎస్‌సీలో పట్టభద్రులైన కుసుమంచి శ్రీదేవి తెలుగు భాషపై ఉన్న అభిమానంతో తెలుగులో ఎంఏ పూర్తి చేసి ప్రభుత్వ పాఠశాలలో తెలుగు ఉపాధ్యాయురాలిగా పనిచేస్తూ ఆటవెలదిలో రచించిన పద్యాల మాధుర్యాన్ని నాగరాజు వివరించారు. తెలుగు భాషలో ఉన్న పద్య సాహిత్యం సంపదని పిల్లలకు అందివ్వాలన్నారు. ప్రతీ రచయిత కనీసం ఒకటైనా పద్యం రచించాలని సూచించారు. సంస్థ అధ్యక్షులు టి.వి.ఎన్.ఆర్.అప్పారావు అధ్యక్షతన జరిగిన ఈ సభలో డాక్టర్ పతివాడ తులసీదాస్ శ్రీశ్రీ సాహిత్యాన్ని నవ, యువకవులు చదవాలని అన్నారు. భళ్లమూడి వెంకట నాగేశ్వరరావు పోస్టుమెన్ అనే స్వియ కథను వినిపించి అనేక ఆధ్యాత్మిక విషయాలు తెలియజేశారు. చిన్నారి చక్రధర్, పీఎంజీ శంకరరావు, ఎల్.శివకేవరావు, రాహమోహన్‌రావు, సత్యనారాయణరాజు తదితరులు పాటలు పాడారు. సహ కార్యదర్శి మామిడి గణపతిరావు, సాహితీ అభిమానులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment