అగ్నిమాపక సిబ్బందికి ఆధునిక పరికరాలు
రాయగడ : అగ్ని ప్రమాదాల సమయంలో మంటలను త్వరితగతిన నియంత్రించేందుకు రాష్ట్ర ప్రభుత్వం అగ్నిమాపక సిబ్బందికి ఆధునిక యంత్రాలను సమకూర్చింది. దీనిలో భాగంగా రోబోటిక్ ఫైర్ ఫైటింగ్ ఇంజిన్, ఫైర్ కంట్రోలింగ్ బుల్లెట్ వాహనాలను అందుబాటులోకి తీసుకొచ్చింది. రోబోటిక్ ఫైర్ ఫైటింగ్ ఇంజిన్ సహాయంతో తక్కువ సమయంలో మంటలను అదుపు చేయవచ్చు. ఎక్కువ మంది సిబ్బంది అవసరం లేకుండా రిమోట్ కంట్రోల్ సాయంతో దీనిని ఆపరేటింగ్ చేయవచ్చని అగ్నిమాపక శాఖ అధికారి రమేష్ చంద్ర బెహరా తెలిపారు.ఈ నెల 26నముఖ్యమంత్రి మోహన్ చరణ్ మాఝి రాయగడ పర్యటన సందర్భంగా ఈ వాహనాలను ప్రారంభించేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు సమాచారం.
Comments
Please login to add a commentAdd a comment