ఉత్సాహంగా పారా అథ్లెటిక్స్ పోటీలు
శ్రీకాకుళం న్యూకాలనీ:
జిల్లాస్థాయి పారా అథ్లెటిక్స్ ఎంపిక పోటీలు ఉత్సాహభరితంగా సాగాయి. శ్రీకాకుళం ప్రభుత్వ పురుషుల డిగ్రీ కళాశాల మైదానంలో స్టీఫెన్ హాకింగ్ పారా స్పోర్ట్స్ అసోసియేషన్ ఆఫ్ శ్రీకాకుళం ఆధ్వర్యంలో జిల్లా క్రీడా ప్రాధికార సంస్థ సహకారంతో ఈ ఎంపికలు నిర్వహించారు. ప్రిన్సిపాల్ డాక్టర్ పి.సురేఖ ప్రారంభించారు. రన్నింగ్, జంప్స్, త్రోస్ అథ్లెటిక్స్ ఈవెంట్స్‌లో జరిగిన ఈ పోటీల్లో 60 మంది పారా క్రీడాకారులు పాల్గొనగా ఉన్నత ప్రతిభ కనబరచిన 31 మందిని రాష్ట్రపోటీలకు ఎంపికచేశారు. ఈ నెల 30న గుంటూరులో జరిగే రాష్ట్రపోటీల్లో వీరంతా ప్రాతినిధ్యం వహిస్తారని డీఎస్‌డీఓ డాక్టర్ కె.శ్రీధర్‌రావు, స్టీఫెన్ హాకింగ్ పారా స్పోర్ట్స్ అసోసియేషన్ ఆఫ్ శ్రీకాకుళం అధ్యక్షుడు టి.రాము, ఎన్.గిరిధర్, కార్యదర్శి డి.అచ్యుతరావు తెలిపారు. కార్యక్రమంలో ఎన్.స్రవంతి, ఖేలో ఇండియా కోచ్ శ్రీనివాస్, ఎన్.రాజేష్ ట్రాఫిక్ జామ్ శ్రీనివాస్, లయన్స్ క్లబ్ అరసవల్లి సెక్రటరీ మణిశర్మ, సాయిబాబా, చింతు, గణపతి తదితరులు పాల్గొన్నారు
Comments
Please login to add a commentAdd a comment