కొరాపుట్‌లో సుకాంత్ మజుందార్ పర్యటన
కొరాపుట్: కేంద్ర విద్యా శాఖ సహాయ మంత్రి సుకాంత్ మజుందార్ కొరాపుట్ జిల్లాలో మంగళవారం పర్యటించారు. దమంజోడి ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో విద్యార్థులతో కలిసి మధ్యాహ్న భోజనం చేశారు. కొరాపుట్ జిల్లా కేంద్రంలో జిల్లాస్థాయి ఉన్నతాధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. అలాగే రాజ్‌పుట్ గ్రామంలో మిల్లెట్ మిషన్ పరిశీలించారు. లుంగిరి గ్రామంలో అంగన్‌వాడీ కేంద్రం పరిశీలించారు. కార్యక్రమంలో కొరాపుట్ జిల్లా కలెక్టర్ వి.కీర్తి వాసన్, కొరాపుట్ ఎమ్మెల్యే రఘురాం మచ్చో తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment