27 క్వింటాళ్ల పీడీఎస్ బియ్యం పట్టివేత
పార్వతీపురం: పార్వతీపురం నుంచి అలమండకు బొలెరో వాహనంలో అక్రమంగా తరలిస్తున్న 27 క్వింటాళ్ల పీడీఎస్ బియ్యాన్ని పట్టుకుని కేసు నమోదు చేసినట్లు సీఎస్‌డీటీ ఎం.రాజేంద్ర తెలిపారు. సోమవారం సాయంత్రం ముందస్తు సమాచారం మేరకు మండలంలోని పెదబొండపల్లి గ్రామంవద్ద బొలెరో వాహనంలో 54 ప్లాస్టిక్ సంచుల్లో తరలిస్తున్న 2700 కిలోల పీడీఎస్ బియ్యం విజిలెన్స్ ఎస్సై రామారావు ఆధ్వర్యంలో పట్టుకున్నట్లు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పీడీఎస్ బియ్యాన్ని విక్రయించినా, కొనుగోలు చేసినా, నిల్వ చేసినా చట్టపరమైన చర్యలు తీసుకోనున్నట్లు హెచ్చరించారు. కార్యక్రమంలో కానిస్టేబుల్ లక్ష్మీనారాయణ తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment