నేడు సెంచూరియన్ వర్సిటీలో కాన్ఫరెన్స్
పర్లాకిమిడి: ఆర్.సీతాపురం సెంచూరియన్ విశ్వవిద్యాలయంలో నేడు క్‌లైయిమేట్ స్మార్ట్ వ్యవసాయంపై కాన్ఫరెన్స్ నిర్వహించనున్నట్లు ఎంఎస్ స్వామినాథన్ వ్యవసాయ కళాశాల ఆర్గనైజింగ్ సెక్రటరీ డాక్టర్ ప్రీతా భధ్ర, డాక్టర్ అతాను దేబ్ తెలిపారు. ఈ మూడు రోజుల సమావేశంలో వివిధ విశ్వవిద్యాలయాల నుంచి మేధావులు, పరిశోధకులు, పాలసీ మేకర్స్ తదితరులు విచ్చేస్తారని తెలియజేశారు.
గ్రీవెన్స్‌లో 28 వినతుల స్వీకరణ
మల్కన్‌గిరి: మల్కన్‌గిరి జిల్లా మత్తిలి సమితిలో అధికారులు సోమవారం గ్రీవెన్స్‌సెల్ నిర్వహించారు. ఈ సందర్భంగా 28 వినతులను జిల్లా అదనపు కలెక్టర్ వేద్బర్ ప్రదన్ స్వీకరించారు. వీటిని పరిశీలించి పరిష్కరిస్తామని కలెక్టర్ హామీ ఇచ్చారు. జిల్లా అదనపు ఎస్పీ తపాన్ నారాయణ్ రోతో, మత్తిలి సమితి సభ్యులు సుభష్ బక్క, ఇతర ఉద్యోగులు పాల్గొన్నారు .
Comments
Please login to add a commentAdd a comment