ప్రతి ధాన్యం గింజను కొనుగోలు చేయాలి
పర్లాకిమిడి: ఖరీఫ్‌లో రైతులు ఆరుగాలం శ్రమించి పండించిన ప్రతి ధాన్యం గింజను ప్రభుత్వం కొనుగోలు చేయాలని నవ నిర్మాణ్ కృషక్ సంఘటన్ రాష్ట్ర కార్యదర్శి అక్షయ కుమార్ డిమాండ్ చేశారు. గజపతి జిల్లాలో 26 సొసైటీలలో ధాన్యం కోనుగోలు చేస్తామని కలెక్టర్ ప్రకటించారని.. అయితే వరి ఎక్కువుగా పండిస్తున్న గుసాని సమితిలో రెండు మండీలనే ఎందుకు తెరిచారని ప్రశ్నించారు. ఏది ఏమైనా ప్రభుత్వ మద్దతు ధరకు రైతుల వద్ద నుంచి ధాన్యం మొత్తం కోనాల్సిందేనని అన్నారు. ఉప్పలాడ ప్రాంతీయ మార్కెట్ కమిటీ యార్డు వద్ద సోమవారం నిర్వహించిన సమావేశంలో గుసాని సమితి నుంచి ఉప్పలాడ, కంట్రగడ, కోర్సండ, బాగుసల, బుసుకిడి పంచాయతీల నుండి వచ్చిన రైతులతో నవ నిర్మాణ్ కృషక్ సంఘటన్ నాయకులు మాట్లాడారు. నవనిర్మాణ్ కృషక్ సంఘటన్ నేతలు మహామ్మద్ మళ్వార్ ఆలీ, రాష్ట్ర సంపాదక మండలి కార్యదర్శి శేష్ దేవ్ నోందో, ప్రభారి రంజిత్ పట్నాయక్, మాణిక్ పారిక్, ధండాశి ఖండవాల్, స్థానికులు లక్షీ నాయక్, ధర్మారావులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా రాష్ట్ర సాధారణ కార్యదర్శి అక్షయ కుమార్ మాట్లాడుతూ.. మండీల వద్ద ధాన్యం నాణ్యత చెక్ చేస్తున్నారని, వీటిలో కొంత కోత విధిస్తుండడాన్ని తాము వ్యతిరేకిస్తున్నామని అన్నారు. ఖరీఫ్ ధాన్యాన్ని పూర్తిస్థాయిలో కొనుగోలు చేయకపోతే ఈ నెల 24వ తేదీన పదివేలమంది రైతులతో గజపతి కలెక్టరేట్ వద్ద రైతుల తరఫున ధర్నా చేస్తామని అక్షయ కుమార్ వెల్లడించారు.
నవనిర్మాణ్ కృషక్ సంఘటన్ రాష్ట్ర
కార్యదర్శి అక్షయ కుమార్
24న కలెక్టరేట్ వద్ద ధర్నా
Comments
Please login to add a commentAdd a comment