జిల్లా స్థాయి జూనియర్ రెడ్‌క్రాస్ శిక్షణ శిబిరం
జయపురం:
కొరాపుట్ జిల్లా జూనియర్ రెడ్‌క్రాస్ శిక్షణ శిబిరం జయపురం సబ్‌డివిజన్ కొట్‌పాడ్ ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో సోమవారం ప్రారంభించారు. ఆ శిబిరంలో కొరాపుట్ జిల్లాలో అన్ని ఉన్నత పాఠశాలల నుంచి జూనియర్ రెడ్‌క్రాస్ విద్యార్థులు పాల్గొన్నారు. కొట్‌పాడ్ ఎమ్మెల్యే రూపు భొత్ర ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. విద్యార్థులు సేవా ప్రవృత్తి అలవరచుకోవాలని సూచించారు. జూనియర్ రెడ్‌క్రాస్ జిల్లా అధికారి భీమ బెహర మాట్లాడుతూ ఈ శిక్షణ జచేతన శిబిరంలో జిల్లాలోని 14 పంచాయతీ సమితులలో గల 167 ఉన్నత ప్రాథమిక పాఠశాల జూనియర్ రెడ్‌క్రాస్ నుంచి 573 మంది విద్యార్థులు వచ్చారని వెల్లడించారు. 167 మంది టీచర్లు వచ్చారని పేర్కొన్నారు. ప్రకృతి వైపరీత్యాలలో అనుసరించాల్సి చర్యలపై శిక్షణ ఇచ్చారు. అగ్నిమాపక సిబ్బంది పలు విన్యాసాలతో అవగాహన కల్పించారు. శిబిరంలో జిల్లా విద్యాధికారి ప్రశాంత కుమార్ మహంతి, జిల్లా జూనియర్ రెడ్‌క్రాస్ సహాయ కార్యదర్శి హరేకృష్ణ మహరాణ, కొట్‌పాడ్ కార్యక్రమ నిర్వహణ బాధ్యతలు చేపట్టిన ప్రధాన ఉపాధ్యాయులు శరత్ కుమార్ సాహు, ఉపాధ్యాయులు సంధీప్ పట్నాయిక్, క్రీడా శిక్షకులు ప్రదీప్ గౌఢ, పాఠశాలలో గల ఉపాధ్యాయులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment