జాతీయ సైక్లింగ్ పోటీలకు తోండ్రంగి విద్యార్థులు
చీపురుపల్లి రూరల్(గరివిడి): గరివిడి మండలంలోని తోండ్రంగి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలకు చెందిన విద్యార్థులు జాతీయస్థాయి సైక్లింగ్ పోటీలకు ఎంపికయ్యారు. డిసెంబర్ 21 నుంచి 23 వరకు కృష్ణా జిల్లాలో జరిగిన రాష్ట్రస్థాయి సైక్లింగ్ పోటీల్లో పాఠశాలకు చెందిన విద్యార్థులు సీహెచ్.నారాయణరావు, బి.అనుపమ, జె.వెన్నెల, పి.థెరిసా, ఒ.సౌమ్య, ఎం.సౌజన్య, ఎన్.జ్యోషిత, కె.మాదురి, డి.హేమలత, ఎస్.అవినాష్, కె.కావ్య సత్తా చాటి జాతీయస్థాయి పోటీలకు ఎంపికయ్యారు. నెల 22 నుంచి 26 వరకు బీహార్ రాష్ట్రంలోని పాట్నాలో, ఝార్ఖండ్ రాష్ట్రంలోని రాంచిలో జరగనున్న జాతీయస్థాయి పోటీల్లో ఈ విద్యార్థులు ప్రతిభను చాటనున్నారు. జాతీయస్థాయి పోటీల్లో ప్రాతినిధ్యం వహించనున్న విద్యార్థులను పాఠశాల ప్రధానోపాధ్యాయుడు కడలి రమేష్‌కుమార్, పీడీ సత్యనారాయణ, ఉపాధ్యాయ సిబ్బంది అభినందించారు.
Comments
Please login to add a commentAdd a comment