రాజశేఖరం పెద్దన్న పాత్ర పోషించారు
● ఎమ్మెల్సీలు తలశిల రఘురాం..
లేళ్ల అప్పిరెడ్డి
పాలకొండ రూరల్: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావం నుంచి పాలవలస రాజశేఖరం ఈ ప్రాంతానికి పెద్దన్నలా కీలకంగా వ్యవహరించారని ఆ పార్టీ రాష్ట్ర కార్యాలయ నిర్వాహకులు, ప్రోగ్రాం కో–ఆర్డినేటర్ ఎమ్మెల్సీలు తలశిల రఘురాం, లేళ్ల అప్పిరెడ్డి, జేఏసీ కన్వీనర్ హర్షవర్ధన్ రెడ్డి తదితరులు అన్నారు. ఇటీవల మరణించిన పాలవలస రాజశేఖరం కుటుంబసభ్యులను సోమవారం వారి స్వగృహంలో పరామర్శించారు. ఈ క్రమంలో రాజశేఖరం సతీమణి ఇందుమతి, కుమారుడు, ఎమ్మెల్సీ విక్రాంత్, కుమార్తె, పాతపట్నం మాజీ ఎమ్మెల్యే రెడ్డి శాంతితో మాట్లాడుతూ వారి తండ్రితో వారికి ఉన్న వ్యక్తిగత అనుబంధాన్ని, కీలక సమయాల్లో పార్టీ అభ్యున్నతికి ఆయన అందించిన సలహాలు, కృషి గుర్తు చేసుకున్నారు. ఆయన లేని లోటు తీర్చలేదంటూ తమ ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. ఈ కలయికలో వారి వెంట నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే విశ్వాసరాయి కళావతి, ఏపీ టిడ్కో మాజీ చైర్మన్ జమ్మాన ప్రసన్నకుమార్, పాలవలస ధవళేశ్వరరావుతో పాటు పాలకొండ, పాతపట్నం, రాజాం నియోజకవర్గాలకు చెందిన పలువురు ప్రజాప్రతినిధులు, పార్టీశ్రేణులు ఉన్నారు. అంతకుముందు వీరు రాజశేఖరం చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.
Comments
Please login to add a commentAdd a comment