టెక్కలి రూరల్: మండలంలోని కొండ భీంపురం గ్రామానికి చెందిన డ్వాక్రా గ్రూపునకు సంబంధించి డ్వాక్రా రుణం డబ్బులు సంబంధిత గ్రూపు స భ్యులకు సమాచారం లేకుండా బ్యాంకు అధికారులు మూడు నెలల క్రితం రూ.17.96 లక్షలు వారి పొదుపు ఖాతాలో జమ చేయడం జరిగింది. అయితే సోమవారం సంబంధిత గ్రూపు సభ్యులకు ఆ డబ్బులకు సంబంధించి వడ్డీ కట్టాలని అధికారులు చెప్పడంతో వారు ఒక్కసారిగా కంగుతిన్నారు. వడ్డీ కట్టేందుకు గ్రూప్ సభ్యులు అగీకరించకపోవడంతో ఇరువురికి ఇబ్బందులు లేకుండా ఎన్‌ఆర్‌ఎల్ ఫండ్స్ ద్వారా కట్టేవిధంగా చూస్తామని బ్యాంకు అధికారులు చెప్పారు. అనంతరం గ్రూప్ సభ్యులు అందరూ వారికి నూతనంగా ఒక్కొక్కరూ రూ.2 లక్షల చొప్పున లోన్ పెట్టేందుకు పత్రాలు ఇవ్వడంతో ఈ సమస్య పరిష్కారమైనట్లు ఏపీఎం ఉమారాణి తెలిపారు.
నాటుసారాతో వ్యక్తి అరెస్టు
ఇచ్ఛాపురం: ఒడిశా నుంచి 200 నాటుసారా ప్యాకెట్లను తరలిస్తున్న వ్యక్తిని అరెస్టు చేసినట్లు ప్రొహిబిషన్ అండ్ ఎకై ్సజ్ అధికారి పి.దుర్గా ప్రసాద్ తెలిపారు. ప్రొహిబిషన్ అండ్ ఎకై ్సజ్ సిబ్బంది తెలిపిన వివరాల మేరకు ఇచ్ఛాపురం ప్రొహిబిషన్ పరిధిలో దాడులు నిర్వహిస్తుండగా హదియా మోహన్ అనే వ్యక్తి నాటుసారా ప్యాకెట్లను ఒడిశా నుంచి అక్రమ రవాణా చేస్తుండగా పట్టుబడినట్లు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment