ఖనిజ సంపదలో ఒడిశా అగ్రగామి
● గనుల వేలంలో రాష్ట్రాలకు అవార్డులు ● స్టార్టప్‌లకు ప్రోత్సాహం ● కోణార్కులో 3వ జాతీయ గనుల శాఖ మంత్రుల సదస్సు
భువనేశ్వర్:
కేంద్ర గనులు, బొగ్గు శాఖ మంత్రి జి.కిషన్ రెడ్డి అధ్యక్షతన పూరీ జిల్లా కోణార్క్‌లో 2 రోజుల పాటు జరిగే 3వ జాతీయ గనుల శాఖ మంత్రుల సదస్సు సోమవారం ప్రారంభమైంది. కార్యక్రమంలో ముఖ్యమంత్రి మోహన్ చరణ్ మాఝీ ముఖ్య అతిథిగా ప్రసంగించారు. తెలంగాణ ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, బీహార్ ఉప ముఖ్యమంత్రి విజయ్ కుమార్ సిన్హా, జమ్మూ – కాశ్మీర్ ఉప ముఖ్యమంత్రులు, జార్ఖండ్ ముఖ్యమంత్రి సహా 16 మంది రాష్ట్రాల గనుల శాఖ మంత్రులు, కేంద్ర, ఒ డిశా ప్రభుత్వాల సీనియర్ అధికారులు పాల్గొన్నా రు. ఖనిజ సంపదలో అగ్రగామిగా ఉన్న ఒడిశా, ఈ పరివర్తనలో కీలక పాత్ర పోషించడానికి సిద్ధంగా ఉందని, ప్రత్యేకించి ’పూర్వోదయ మిషన్’లో భా గంగా, ఇది భారతదేశ ఆర్థిక సామర్థ్యానికి మార్గం సుగమం చేసి మరింత సంపన్నమైన, స్వావలంబన కలిగిన దేశ నిర్మాణంలో కీలక పాత్రధారి అవుతుందని సీఎం ఆశాభావం వ్యక్తం చేశారు.
గనుల వేలంలో రాష్ట్రాలకు అవార్డులు
ఈ సదస్సు పురస్కరించుకుని జాతీయ స్థాయిలో గనుల వేలంలో అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన రాష్ట్రాలకు రాష్ట్ర ముఖ్యమంత్రి మోహన్ చరణ్ మాఝీ అవార్డులు అందజేశారు. ఈ రంగంలో 3 తొలి అగ్ర రాష్ట్రాలకు అవార్డులు ప్రదానం చేశారు. 31 వేలంపాటలతో రాజస్థాన్ అగ్ర స్థానంలో నిలిచింది. 22 గనుల వేలంతో మధ్య ప్రదేశ్ తదుపరి స్థానం సాధించగా 10 వేలంపాటలతో మహారాష్ట్ర 3వ స్థానంలో నిలిచింది. ఈ రాష్ట్రాలు 2023–24 ఆర్థిక సంవత్సరంలో చురుకై న వేలం ప్రక్రియతో వనరులను మెరుగుపరచడంలో అత్యుత్తమ పనితీరు కనబరిచాయని ముఖ్యమంత్రి అభినందించారు.
స్టార్టప్‌లకు ప్రోత్సాహం
ఈ వేదికపై స్టార్టప్‌లు, ఎంఎస్‌ఎమ్‌ఈ మరియు గనుల విభాగం పరిశోధన రంగంలో నిపుణులకు గ్రాంట్ల ఆమోద పత్రాలను ముఖ్యమంత్రి మోహన్ చరణ్ మాఝీ అందజేశారు. ఈ సందర్భంగా 11 స్టార్టప్‌లు గనుల శాఖ ఎస్ అండ్ టీ ప్రిజమ్ కాంపోనెంట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ కార్యక్రమం కింద రూ. 15.97 కోట్ల మొత్తాన్ని అందుకున్నాయి. ఈ స్టార్టప్‌లు స్వదేశీ సాంకేతికతలను అభివృద్ధి చేయడంపై దృష్టి సారిస్తాయి. గనుల రంగంలో పరిశోధనలు, ఆవిష్కరణలు, వృద్ధిని ప్రేరేపించినందు కు వారిని అభినందించారు.
నివేదిక వెల్లడి
29 రాష్ట్రాల గనుల నిర్వహణలో ఉత్తమ విధానాల తో కూడిన సమగ్ర నివేదికని రాష్ట్ర ముఖ్యమంత్రి మోహన్ చరణ్ మాఝీ బీహార్ ఉప ముఖ్యమంత్రి విజయ్ సిన్హా విడుదల చేశారు. గనుల నిర్వహణ పద్ధతులలో ఆవిష్కరణ, స్థిరత్వాన్ని ఈ నివేదిక సమగ్ర సమాచారం అందజేస్తుందన్నారు. రాష్ట్రా లు అమలు చేస్తున్న వినూత్న పాలనా నమూనాల తో గనుల పద్ధతుల్లో సామర్థ్యం మరియు పారదర్శకతను మెరుగుపరచడంలో ఈ నివేదిక దోహదపడుతుందని కేంద్ర గనులు, బొగ్గు శాఖ మంత్రి జి. కిషన్ రెడ్డి తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment