దారికాచిన మృత్యువు | - | Sakshi
Sakshi News home page

దారికాచిన మృత్యువు

Published Tue, Jan 21 2025 12:42 AM | Last Updated on Tue, Jan 21 2025 12:42 AM

దారిక

దారికాచిన మృత్యువు

రోడ్డు ప్రమాదంలో యువకుడి దుర్మరణం

మరో వ్యక్తికి తీవ్రగాయాలు

స్నేహితుడిని డ్రాప్‌ చేసి తిరిగి వస్తుండగా ఘటన

కంచిలి, సోంపేట: మండలంలోని జలంత్రకోట గ్రామ కూడలి వద్ద జాతీయ రహదారిపై సోమవారం వేకువజామున ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. వివరాల్లోకి వెళ్తే.. సోంపేట మండలంలోని బారువ గ్రామానికి చెందిన హరీష్‌కుమార్‌ పాణిగ్రాహి(31), అనిల్‌కుమార్‌ పాణిగ్రాహిలు కంచిలి నుంచి కారులో బారువ వెళ్తుండగా ఈ ప్రమాదం చోటుచేసుకొంది. ఈ ప్రమాదంలో హరీష్‌కుమార్‌ పాణిగ్రాహికు తీవ్రగాయాలై అక్కడికక్కడే మృతి చెందాడు. అనిల్‌కుమార్‌ తీవ్రగాయాలపాలయ్యాడు. అనిల్‌ను వెంటనే సోంపేట ప్రభుత్వ ఆస్పత్రికి హైవే అంబులెన్స్‌లో తరలించి, ప్రథమ చికిత్స చేశారు. అనంతరం మెరుగైన చికిత్స కోసం టెక్కలి, తర్వాత శ్రీకాకుళం, అక్కడి నుంచి విశాఖపట్నం తరలించారు. మృతుడు హరీష్‌, అనిల్‌లు కంచిలికి చెందిన తమ స్నేహితుడు నర్తు రాజేష్‌ను పలాస రైల్వేస్టేషన్‌ పికప్‌ చేసుకొని కంచిలిలో డ్రాప్‌ చేశారు. అనంతరం తమకు చెందిన కారులో కంచిలి నుంచి బారువ వస్తుండగా, పొగమంచు కారణంగా ఎదురుగా వస్తున్న టిప్పర్‌ లారీ కనిపించకపోవడంతో ఢీకొన్నారు. ఈ ప్రమాదంలో డ్రైవింగ్‌ చేస్తున్న హరీష్‌ అక్కడికక్కడే మృతిచెందాడు. అనిల్‌ తీవ్రగాయాలతో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు.

అంతలోనే ఘోరం

బారువ గ్రామానికి చెందిన రోజారాణి కుమారుడు హరీష్‌ సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్‌గా హైదరాబాద్‌లో ఉద్యోగం చేస్తున్నాడు. వర్క్‌ఫ్రమ్‌ హోమ్‌ నేపథ్యంలో రెండు నెలలుగా ఇంటి దగ్గర నుంచే ఉద్యోగం చేస్తున్నాడు. సంక్రాంతి పండగ ముగియడంతో సోమవారం సాయంత్రం హైదరాబాద్‌ వెళ్లడానికి సిద్ధమయ్యాడు. ఇంతలోనే ఘోరం జరిగిపోయింది. హైదరాబాద్‌ వెళ్లాల్సిన కుమారుడు రహదారి ప్రమాదంలో మృతి చెందడంతో తల్లి వేదన వర్ణనాతీతం. రోజారాణి భర్త చాలా రోజుల క్రితం పిల్లలను, భార్యను విడిచిపెట్టి వెళ్లిపోయాడు. దీంతో పిల్లలే తన సర్వస్వంగా భావించి విద్యాబుద్ధులు నేర్పించింది. దీనిలో భాగంగా హరీష్‌ చదువుకుని సాప్ట్‌వేర్‌ ఇంజినీర్‌గా స్థిరపడ్డాడు. అనంతరం అతడు తన తమ్ముడు శిరీష్‌, చెల్లెలు శ్వేతను ప్రయోజకులను చేశాడు. సోదరి శ్వేత బారువ స్టేట్‌బ్యాంకులో ఉద్యోగినిగా విధులు నిర్వహిస్తోంది. సోదరుడు స్థానిక షిరిడిసాయి ఆలయంలో అర్చకుడిగా చేస్తున్నాడు. హరీష్‌కు త్వరలోనే వివాహం చేయాలని నిశ్చయించగా, ఇంతలోనే ఇలా మృత్యువు కబలించడంతో కుటుంబ సభ్యులంతా దుఃఖ సాగరంలో మునిగిపోయారు. హరీష్‌ తల్లి ప్రమాదం జరగడానికి ముందే ఫోన్‌చేస్తే పావుగంటలో ఇంటికి వస్తున్నానని చెప్పాడు. అంతలోనే కొడుకు మృతి చెందడంతో ఆమెను ఓదార్చడం ఎవరితరం కావడం లేదు.

పాలఖండ్యాంలో పశువుల కాపరి

జి.సిగడాం: మండలంలోని పాలఖండ్యాం గ్రామానికి చెందిన బత్తుల పోలారావు(50) సోమవారం సాయంత్రం మినీ వ్యాన్‌ ఢీకొని అక్కడికక్కడే మృతి చెందాడు. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. రాజాం–శ్రీకాకుళం ప్రధాన రహదారిలో మెట్టవలస–పాలఖండ్యాం గ్రామ సమీపంలో ఉన్న వాటర్‌ ట్యాంకు వద్ద పశువులను కాపు కాస్తూ ఉండగా వేగంగా వచ్చిన వ్యాన్‌ ఢీకొంది. దీంతో ఘటన స్థలంలోనే పోలారావు మృత్యువాత పడ్డాడు. మృతుడికి భార్య ఆదిలక్ష్మి, కుమారైలు పూజిత, ఇంద్రజ ఉన్నారు. కేసు న మోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని ఎస్‌ఐ వై. మధుసూదనరావు తెలిపారు. మృతదేహాన్ని రాజాం సామాజిక అస్పత్రికి తరలించామన్నారు. ఘటన స్థలానికి సర్పంచ్‌ ధారబోయిన ధర్మారా జ్‌, మాజీ సర్పంచ్‌ పలిశెట్టి సూర్యనారాయణ, ఉపసర్పంచ్‌ ఇజ్జి గోవిందరావు, అరుణోదయ విద్యా సంస్థల డైరెక్టర్‌ డాక్టర్‌ గర్లంకి శ్రీనివాసరా వు తదితరులు వెళ్లి సంతాపం తెలిపారు. నిరుపే ద కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలని కోరారు.

No comments yet. Be the first to comment!
Add a comment
దారికాచిన మృత్యువు 1
1/2

దారికాచిన మృత్యువు

దారికాచిన మృత్యువు 2
2/2

దారికాచిన మృత్యువు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement