పేదలకు దుప్పట్లు పంపిణీ
రాయగడ: జిల్లాలోని కొలనారలో ఉన్న మా జగదాంబ ప్రభాత్ సేవా సమితి ఆధ్వర్యంలో నిరుపేదలకు దుప్పట్లను సోమవారం పంపిణీ చేశారు. సమితిలోని భొతుడి, ఫకిరి, తొటాగు డ, ఆరబి, నకిటిగుడ గ్రామంలో సేవా సమితి సభ్యులు పర్యటించి పేదలకు దుప్పట్లను పంపిణీ చేస్తున్నారు. గత కొద్ది రోజులుగా విపరీతంగా శీతలగాలులు వీస్తుండటంతో చలిని తట్టుకొలేని పరిస్థితి నెలకొనడంతో ఈ సేవా కార్యక్రమాన్ని చేపట్టామని సభ్యులు దుఖి హుయిక, భాను హుయికలు తెలిపారు.
గ్రీవెన్స్‌సెల్‌కు 102 వినతులు
పర్లాకిమిడి: గజపతి జిల్లా రాయఘడ బ్లాక్ కెరండి పంచాయతీ కార్యాలయంలో సోమవా రం స్పందన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఏడీఎం రాజేంద్రమింజ్, జిల్లా ఎస్పీ జితేంద్ర కుమార్ పండా అధ్యక్షత వహించగా, డీఆర్ డీఏ ముఖ్యకార్యనిర్వాహణ అధికారి గుణనిధి నాయక్, రాయగడ సమితి చైర్మన్ పూర్ణబాసి నాయక్‌లు పాల్గొన్నారు. ఈ వారం 102 వినతులు అందగా..వీటిలో గ్రామసమస్యలు 39, 63 వ్యక్తిగత సమస్యలకు సంబంధించిన వినతులు ఉన్నాయి. రెండు వినతులను అధికారు లు అక్కడికక్కడే పరిష్కరించారు. బీడీవో సుధీ ర్ సింగ్, రాయగడ ఉపాధ్యక్షురాలు జ్యోతి ప్ర సాద్‌పాణి, తహసీల్దార్ శ్రీకాంత్ ప్రధాన్, సీడీఎం పబ్లిక్ హెల్త్ ఆఫీసర్ యం.యం.ఆలీ, డీఎస్‌ఎస్‌వో సంతోష్‌కుమార్ నాయక్ పాల్గొన్నారు.
100 కిలోల గంజాయి పట్టివేత
మల్కన్‌గిరి: మల్కన్‌గిరి జిల్లా పోడియ సమితి కుమార్‌గూఢ గ్రామం వద్ద ఆదివారం రాత్రీ పెట్రోలింగ్ నిర్వహిస్తున్న పోలీసులు చత్తీస్‌గఢ్ వైపు వేగంగా వెళ్తున్న కారును ఆపి తనిఖీ చేయగా అందులో నాలుగు బస్తాల్లో గంజాయి కనిపించింది. వెంటనే గంజాయి స్వాధీనం చేసుకుని ముగ్గురిని అరెస్టు చేశారు. నిందితు ల్లో ఇద్దరు ఉత్తరప్రదేశ్‌కు చేందిన ఫిరాజ్ సైఫీ, నాజిమ్ మల్లిక్ వీరికి మల్కన్‌గిరికి చెందిన గురుచంధ్ మండాల్ సహకరించాడని పోలీసులు తెలిపారు. ఈ గంజాయి దాదాపు 80 కిలోలు ఉంది. అలాగే కలిమెల సమితి మోటు పోలీసులు ఓ బైక్ పై తరలిస్తున్న 20 కిలోల గంజాయిని ఆదివారం రాత్రి పట్టుకున్నారు. కిషోర్ అనే వ్యక్తిని అరెస్టు చేశారు.
శ్యామ సుందరస్వామిని తాకిన సూర్య కిరణాలు
టెక్కలి: స్థానిక శ్యామసుందరస్వామి ఆలయంలో సోమవారం స్వామివారిని సూర్య కిరణాలు తాకాయి. శ్రీదేవి, భూదేవి సమేత శ్యామసుందరస్వామిని సూర్యకిరణాలు తాకడంతో భక్తులు ప్రత్యేక పూజలు నిర్వహించారు.
Comments
Please login to add a commentAdd a comment