భువనేశ్వర్: రాష్ట్ర వ్యాప్తంగా గణతంత్ర వేడుకలకు సన్నాహాలు చురుకుగా సాగుతున్నాయి. ఈ సందర్భంగా పలు ప్రాంతాల్లో ప్రముఖులు జాతీయ పతాకాలను ఆవిష్కరిస్తారు. ఈ మేరకు ముఖ్యమంత్రి కార్యాలయం మంగళవారం సమగ్ర జాబితా విడుదల చేసింది. రాష్ట్ర రాజధాని నగరంలో రాష్ట్రస్థాయి గణతంత్ర దినోత్సవ కార్యక్రమంలో గవర్నర్ డాక్టర్ హరిబాబు కంభంపాటి జాతీయ పతాకం ఆవిష్కరిస్తారు. స్థానిక మహాత్మా గాంధీ మార్గంలో ఈ కార్యక్రమానికి ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ నెల 26న రాష్ట్రంలో వివిధ ప్రదేశాల్లో నిర్వహించే జాతీయ పతాక ఆవిష్కరణలో మంత్రులు, ఇతర ప్రముఖులు పాల్గొంటారు. రాష్ట్ర ముఖ్యమంత్రి మోహన్ చరణ్ మాఝీ కటక్‌లో జాతీయ జెండాను ఆవిష్కరిస్తారు. ఇతర మంత్రులకు 15 జిల్లాలు కేటాయించారు. కేంద్రాపడా, బరంపురం మరియు రౌర్కెలాలో ఆర్డీసీలు త్రివర్ణ పతాకం ఆవిష్కరిస్తారు. మిగిలిన జిల్లాల ప్రధాన కార్యాలయంలో కలెక్టర్లు ఈ కార్యక్రమంలో పాల్గొంటారు.
Comments
Please login to add a commentAdd a comment