మల్కన్‌గిరి:
చత్తీస్‌గఢ్ సరిహద్దులోని అడవి దద్దరిల్లింది. మావోలు, పోలీసులకు మధ్య జరిగిన కాల్పులతో నెత్తుటి ఏరు పారింది. చత్తీస్‌గఢ్ రాష్ట్రం గరియబంద్ జిల్లా కల్లురిఘట్ అడవిలో మంగళవారం ఉదయం మావోలు, పోలీసులకు మధ్య భీకర కాల్పులు జరిగాయి. అంతకు ముందే కాల్పులు జరిగినా మంగళవారం ఉదయం మాత్రం ఎడతెరిపి లేకుండా బుల్లెట్ల వర్షం కురిసింది. ఘటనలో 14 మంది మావోలు మృత దేహాలు గుర్తించారు. మృతుల్లో మావోయిస్టుల ఒడిశా చీఫ్ సెక్రటరీ చలపతి ఉన్నట్లు గుర్తించారు.
ముగిసిన పోరాట
ప్రస్థానం
చిత్తూరు నుంచి శ్రీకాకుళం మీదుగా ఒడిశా వరకు సాగిన చలపతి ఉద్యమ ప్రస్థానం ముగిసిపోయింది. ఎన్నో కీలక ఆపరేషన్లలో మాస్టర్‌మైండ్‌గా వ్యవహరించిన మావో అగ్రనేత పోలీసు తూటాకు నేలకూలారు. ప్రతాప రెడ్డి, అలియాస్ రామచంద్రారెడ్డి ఉరఫ్ చలపతిపై కోటి రూపాయల రివార్డు ఉంది. నాలుగు రాష్ట్రాల పోలీసులకు ఆయన మోస్ట్ వాంటెడ్. సాధారణ ఏరియా సభ్యుడిగా ఉద్యమాన్ని మొదలుపెట్టిన చలపతి ప్రస్తుతం మావోయిస్టు కమిటీ ఒడిశా సెక్రటరీ స్థాయికి ఎదిగారు. ఆయన నెట్‌వర్క్ ఎంత బలమైనదంటే.. చలపతి యువకుడిగా ఉన్నప్పటి ఫొటో తప్పితే ఆయనకు వయసు అయ్యాక ఎలా ఉంటారో పోలీసులకు దశాబ్దాల పాటు తెలియలేదు. కొన్నేళ్ల కిందట పోలీసులకు మావోల దగ్గర దొరికిన ల్యాప్‌టాప్‌లో తన భార్యతో కలిసి
ఉన్న చలపతి ఫొటో దొరికింది. అప్పటికి గానీ ఆయన రూపురేఖలు పోలీసులకు తెలియలేదు. 1970లలోనే ఆయన ఉద్యమ ప్రస్థానం మొదలైనా.. 1993లో చిత్తూరు నుంచి వచ్చి ఆంధ్రా–ఒడిశా బోర్డర్ గాలికొండలో ఏరియా సభ్యులుగా మావోయిస్టు పార్టీలో చేరి అంచెలంచెలుగా ఎదిగారు. మల్కన్‌గిరి జిల్లా చిత్రకొండ సమితి కటాఫ్ ఏరియాలో 9 పంచాయతీలను చలపతి తన ఆధీనంలో ఉంచుకున్నారు. 2004లో కొరాపూట్ జిల్లాలో పోలీస్‌స్టేషన్‌పై దాడి, 2003లో ధమాన్‌జోడి లోనేల్కో మైన్స్ కంపెనీపై దాడి, మాచ్‌ఖండ్ పోలీసుస్టేషన్‌పై దాడి, చిత్రకొండ సమితిలో సెల్ టవర్ల పేల్చివేత, 2009లో ఆంధ్రా గ్రేహౌండ్స్‌పై చిత్రకొండ జలాశయంలో కాల్పులు, 2011లో కలెక్టర్ వినీల్ కృష్ణ కిడ్నాప్ వ్యవహారంలో ఆయన కీలకంగా వ్యవహరించారు. 2018లో ఆంధ్రాలో ఎమ్మెల్యేలపై దాడి ప్రణాళిక కూడా ఆయనదే. తన ప్రాంతంలో బీఎస్‌ఎఫ్ కదలికలు మొదలయ్యాక తన బేస్‌ను కంధమాల్‌కు మార్చుకున్నారు. మావోయిస్టు పార్టీలోనే అరుణ అనే మహిళా మావోయిస్టును వివాహం చేసుకున్నారు.
అడవిలో మృతదేహాల వద్ద జవాన్లు
సంఘటన
స్థలంలో
మావోయిస్టు
మృతదేహం
న్యూస్‌రీల్
ఒడిశా–చత్తీస్‌గఢ్ సరిహద్దులో భారీ ఎన్‌కౌంటర్
పెద్ద ఎత్తున మావోలు మృతి
మృతుల్లో మావో అగ్రనేత చలపతి
Comments
Please login to add a commentAdd a comment