పోలీసుస్టేషన్ ముట్టడి
రాయగడ: జిల్లాలోని కాసీపూర్ సమితి మైకంచ్ పంచాయతీ సర్పంచ్ మస్తారాం మాఝిపై దాడిని ఖండిస్తూ జిల్లాలోని సర్పంచ్‌లు, వివిధ పార్టీల ప్రజా ప్రతినిధులు సోమవారం సదరు పోలీస్‌స్టేషన్‌ను ముట్టడించారు. ఈనెల 16వ తేదీన సర్పంచ్‌పై సోయల్ కంజర్వేషన్ శాఖ అధికారి కుమార్ నాయక్, అతని అనుచరుడు దాడిచేసిన విషయం తెలిసిందే. ఈ మేరకు అదేరోజు సాయంత్రం సదరు పోలీస్‌స్టేషన్‌లో కుమార్‌నాయక్‌పై బాధితుడు ఫిర్యాదు చేశాడు. అయితే రోజులు గడుస్తున్నా ఇంతవరకు నిందితులపై ఎటువంటి చర్యలు తీసుకోలేదు. దీంతో పోలీసుస్టేషన్‌ను ముట్టడించి ఎస్డీపీవో రస్మీరంజన్ సేనాపతి, ఐఐసీ కేకేబీకే కుహరోలను నిలదీశారు. సిల్వర్ ఒక్ ప్లాంటేషన్‌కు సంబంధించిన బిల్లులను చెల్లించాల్సిందిగా సర్పంచ్ అడగడంతో అతనిపై దాడి చేయడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. దీనిపై స్పందించిన పోలీసులు ఆ కేసుకు సంబంధించి అన్ని కోణాల్లో దర్యాప్తు చేపడుతున్నామని, మరో నాలుగు రోజుల వ్యవధిలో నిందితులను అరెస్టు చేస్తామని హామీ ఇవ్వడంతో ఆందోళనను విరమించారు. జిల్లా పరిషత్ మాజీ అధ్యక్షుడు గంగాధర్ పువ్వల, హలువ సర్పంచ్ తమ్మారావు బిడికల నేతృత్వంలో ఈ ఆందోళన జరిగింది.
Comments
Please login to add a commentAdd a comment