సత్తెనపల్లి ఆర్డీఓ రమాకాంతరెడ్డి బాధ్యతల స్వీకారం | - | Sakshi
Sakshi News home page

సత్తెనపల్లి ఆర్డీఓ రమాకాంతరెడ్డి బాధ్యతల స్వీకారం

Published Sat, Oct 5 2024 3:40 AM | Last Updated on Sat, Oct 5 2024 3:40 AM

సత్తె

సత్తెనపల్లి: సత్తెనపల్లి రెవెన్యూ డివిజన్‌ అధికారిగా గాజులపల్లి వెంకట రమాకాంతరెడ్డి శుక్రవారం బాధ్యతలు స్వీకరించారు. సాధారణ బదిలీల్లో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం 57 మంది ఆర్డీఓలను బదిలీ చేసిన విషయం విదితమే. దీనిలో భాగంగా గురజాల ఆర్డీవోగా విధులు నిర్వర్తిస్తున్న వెంకటరమకాంతరెడ్డిని సత్తెనపల్లి బదిలీ చేశారు. ఇప్పటి వరకు ఇక్కడ ఆర్డీవోగా విధులు నిర్వర్తిస్తున్న వి.మురళీకృష్ణ గురజాల ఆర్డీవోగా బదిలీ అయ్యారు. శుక్రవారం ఆర్డీఓ మురళీకృష్ణ రిలీవ్‌ అయ్యారు. నూతనంగా బాధ్యతలు చేపట్టిన ఆర్డీవో వెంకట రమకాంతరెడ్డి మాట్లాడుతూ క్షేత్రస్థాయిలో అధికారులందరూ ప్రజల సమస్యలపై సత్వరమే స్పందించాలన్నారు. రెవెన్యూ సేవలు ప్రజలకు మరింత చేరువయ్యేలా చూస్తానన్నారు. నూతనంగా బాధ్యతలు చేపట్టిన ఆర్డీవో వెంకటరమణకాంతరెడ్డిని సత్తెనపల్లి, పెదకూరపాడు నియోజకవర్గాల్లోని తహసీల్దార్లు మర్యాదపూర్వకంగా కలిసి అభినందనలు తెలిపారు.

గురజాల ఆర్డీఓ మురళీకృష్ణ బాధ్యతల స్వీకారం

గురజాల: గురజాల రెవె న్యూ డివిజనల్‌ అధికారిగా వి మురళీకృష్ణ శుక్రవారం బాధ్యతలు స్వీకరించారు. ఇప్పటివరకు ఆర్డీవోగా విధులు నిర్వర్తించిన జీవీ రమణాకాంత్‌రెడ్డి సాధారణ బదిలీల్లో భాగంగా సత్తెనపల్లికి వెళ్లారు. సత్తెనపల్లిలో విధులు నిర్వర్తిస్తు న్న వి మురళీకృష్ణ గురజాలకు బదిలీపై వచ్చా రు. నూతనంగా బాధ్యతలు స్వీకరించిన ఆర్డీవోను పలువురు తహసీల్దార్‌లు, రెవెన్యూ కా ర్యాలయం సిబ్బంది శుభాకాంక్షలు తెలిపారు.

జిల్లాలో 255.8 మిల్లీమీటర్ల వర్షం నమోదు

నరసరావుపేట: జిల్లాలో గడిచిన 24గంటల వ్యవధిలో 255.8 మిల్లీమీటర్ల వర్షం కురిసినట్లు సంబంధిత అధికారులు శుక్రవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. అత్యధికంగా రెంటచింతలలో 38.2 మి.మీటర్ల వర్షం కురిసింది. మాచర్లలో 23.6, వెల్దుర్తిలో 9.4, దుర్గిలో 16.2, కారెంపూడిలో 4.6, పిడుగురాళ్లలో 20.4, మాచవరంలో 1.2, బొల్లాపల్లిలో 28.4, వినుకొండలో 23.4, నూజెండ్లలో 9.2, శావల్యాపురంలో 31.8, ఈపూరులో 32.4, రొంపిచర్లలో 2.4, నరసరావుపేటలో 14.6 మి.మీ వర్షపాతం నమోదైంది. నాలుగురోజుల వ్యవధిలో 427.1 మి.మీ వర్షం పడాల్సివుండగా 457.0 వర్షం కురవడం విశేషం.

టెట్‌కు 39మంది గైర్హాజరు

నరసరావుపేట ఈస్ట్‌: పల్నాడు జిల్లా కేంద్రం నరసరావుపేటలో ఏపీ టెట్‌–2024 పరీక్షలు ప్రశాంతంగా కొనసాగుతున్నాయి. పరీక్షను ఉదయం, మధ్యాహ్నం రెండు సెషన్స్‌లో నిర్వహిస్తుండగా, శుక్రవారం ఉదయం సెషన్‌ షెడ్యూల్‌లో పరీక్ష లేదు. మధ్యాహ్నం ఏఎం రెడ్డి ఇంజినీరింగ్‌ కళాశాల, ఎంఏఎం ఇంజినీరింగ్‌ కళాశాలలో నిర్వహించిన పరీక్షకు 260 మంది అభ్యర్థులకుగాను, 221మంది హాజరయ్యారు. మరో 39 మంది గైర్హాజరైనట్టు అధికారులు తెలిపారు. జిల్లా విద్యాశాఖాధికారి ఎం.వెంకటేశ్వర్లు ఎంఏఎం కళాశాల పరీక్ష కేంద్రాన్ని సందర్శించి పరీక్ష నిర్వహణ తీరును పరిశీలించి అధికారులకు తగు సూచనలు చేశారు.

No comments yet. Be the first to comment!
Add a comment
సత్తెనపల్లి ఆర్డీఓ రమాకాంతరెడ్డి బాధ్యతల స్వీకారం 1
1/1

సత్తెనపల్లి ఆర్డీఓ రమాకాంతరెడ్డి బాధ్యతల స్వీకారం

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement