ఎన్నికల హామీలను నెరవేర్చాలి
నరసరావుపేట ఈస్ట్: ఉద్యోగులు, ఉపాధ్యాయులకు ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను రాష్ట్ర ప్రభుత్వం నెరవేర్చాలనీ, లేకుంటే ఉద్యమాలకు సైతం వెనుకాడబోమని ఏఐఎస్‌టీఎఫ్ జాతీయ కార్యదర్శి, ఎస్‌టీయూ రాష్ట్ర మాజీ అధ్యక్షుడు సీహెచ్ జోసఫ్ సుధీర్‌బాబు స్పష్టం చేశారు. మున్సిపల్ బాలుర ఉన్నత పాఠశాలలో ఆదివారం జిల్లా ద్వితీయ కార్యవర్గ సమావేశం నిర్వహించారు. సమావేశానికి ఎస్‌టీయూ జిల్లా అధ్యక్షుడు ఎల్.వి.రామిరెడ్డి అధ్యక్షత వహించారు. సమావేశంలో జోసఫ్ సుధీర్‌బాబు మాట్లాడుతూ, ప్రభుత్వం వెంటనే 35 శాతం ఐఆర్ ప్రకటించాలనీ, పెండింగ్‌లో ఉన్న డీఏ, పీఆర్సీ ఎరియర్లను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ఎన్నికల హామీ మేరకు కూటమి ప్రభుత్వం సీపీఎస్ రద్దును వెంటనే అమలు చేయాలన్నారు. ఎస్‌టీయూ రాష్ట్ర ఆర్థిక కార్యదర్శి కె.కోటేశ్వరరావు మాట్లాడుతూ 117 జీఓను రద్దు చేసి ప్రభుత్వ పాఠశాలలను కాపాడాలని కోరారు. ఉపాధ్యాయులపై యాప్‌ల భారం లేకుండా చూడాలన్నారు. ఎస్‌టీయూ నాయకులు ఎస్.ఎం.సుభాని, జె.గంగాధరబాబు, వెంకటకోటయ్య, జిల్లా ప్రధాన కార్యదర్శి యు.చంద్రజిత్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు.
ఎస్‌టీయూ డిమాండ్
Comments
Please login to add a commentAdd a comment