స్వచ్ఛంద సంస్థలు ప్రచారం చేపట్టాలి | - | Sakshi
Sakshi News home page

స్వచ్ఛంద సంస్థలు ప్రచారం చేపట్టాలి

Published Tue, Nov 5 2024 2:10 AM | Last Updated on Tue, Nov 5 2024 2:10 AM

స్వచ్

స్వచ్ఛంద సంస్థలు ప్రచారం చేపట్టాలి

నరసరావుపేటరూరల్‌: రోడ్డు ప్రమాదాల నివారణపై ప్రజలకు అవగాహన కల్పిస్తూ ఎన్‌జీవోలు ప్రచారం చేపట్టాలని జిల్లా రవాణా అధికారి సంజీవ్‌కుమార్‌ తెలిపారు. రోడ్డు ప్రమాదాల నివారణపై రోడ్డు సేప్టీ ఎన్‌జీవో కమిటీ సభ్యులు రూపొందించిన పోస్టర్‌ను సోమవారం జిల్లా రవాణా అధికారి సంజీవ్‌కుమార్‌ ఆవిష్కరించారు. సంజీవ్‌కుమార్‌ మాట్లాడుతూ హెల్మెట్‌ ధరించి వాహనం నడపాలని తెలిపారు. మద్యం సేవించి వాహనం నడపరాదని, జాతీయ రహదారులపై తప్పని సరిగా వరుస క్రమశిక్షణను పాటించాలని తెలిపారు. రోడ్డు ప్రమాదాల నివారణపై స్వచ్ఛంద సంస్థలు ప్రజలకు అవగాహన కల్పించేలా కార్యక్రమాలు చేపట్టాలని సూచించారు. కార్యక్రమంలో ఎన్‌జీవో సభ్యులు బంగారయ్య, ఎన్‌జీవో సభ్యులు పాల్గొన్నారు.

ఆర్టీసీలో అప్రెంటీస్‌ కోసం దరఖాస్తు చేసుకోండి

నరసరావుపేట: ఏపీఎస్‌ఆర్టీసీలో అప్రెంటీస్‌ చేసేందుకు ఐటీఐ అభ్యర్థులు ఽఈనెల 6వ తేదీ నుంచి 20వ తేదీలోగా ఽఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలని విజయవాడ జోనల్‌ సిబ్బంది శిక్షణ కళాశాల ప్రిన్సిపల్‌ వి.నీలిమ సోమవారం ఒక ప్రకటనలో కోరారు. ఎన్‌టీఆర్‌, కృష్ణా, గుంటూరు, బాపట్ల, పల్నాడు, ఏలూరు, పశ్చిమ గోదావరి జిల్లాల్లోని ఐటీఐ ఉత్తీర్ణులైన అభ్యర్థులు దీనికి అర్హులన్నారు. వీరందరూ జిల్లాల వారీగా www. aprenticerhipindia.gov.in వెబ్‌సైట్‌లో దరఖాస్తు చేసుకోవాలని కోరారు. మార్కులు, సీనియార్టీ ప్రకారం ఎంపికలు జరుగుతాయన్నారు.

మన్నెసుల్తాన్‌పాలెంలో మొసలి సంచారం

బెల్లంకొండ: మండలంలోని మన్నెసుల్తాన్‌పాలెంలోని ఊరి చివర బస్టాండ్‌ సమీపంలో సోమవారం రాత్రి మొసలి సంచరించడాన్ని స్థానికులు గమనించారు. మొసలి పొలాలలో నుంచి రోడ్డుపైకి వస్తుండగా బైకులపై వెళ్లే ప్రయాణికులు గమనించారు. రోడ్డుమీదకు వచ్చి దాదాపుగా పావుగంట సేపు ఎటు వెళ్లకుండా ఆగిపోయింది. దీంతో వాహనచోదకులు అక్కడే నిలిచిపోయారు. కొంతసేపటి తర్వాత పక్కనే ఉన్న ముళ్లపొదల్లోకి వెళ్లడంతో ఊపిరి పీల్చుకున్నారు.

నేటి నుంచి జిల్లాస్థాయి జీపీడీపీ శిక్షణ

గుంటూరు ఎడ్యుకేషన్‌: ఉమ్మడి గుంటూరు జిల్లా పరిధిలోని గ్రామ పంచాయతీల్లో 2025–26 వార్షిక ప్రణాళిక రూపకల్పనపై జిల్లా, డివిజన్‌, మండలస్థాయి అధికారులతోపాటు పంచాయతీ కార్యదర్శులకు మంగళవారం నుంచి ఈనెల 8వ తేదీ వరకు గ్రామ పంచాయతీ అభివృద్ధి ప్రణాళిక (జీపీడీపీ)పై శిక్షణ నిర్వహిస్తున్నట్టు జెడ్పీ సీఈఓ వి.జ్యోతిబసు సోమవారం ఓప్రకటనలో తెలిపారు. ప్రజా ప్రణాళిక ఉద్యమం 2025–26లో భాగంగా గ్రామ పంచాయతీ, మండల పరిషత్‌ అభివృద్ధి, జిల్లా పంచాయతీ, జిల్లా ప్రజా పరిషత్‌ అభివృద్ధి ప్రణాళికలపై సమగ్ర కార్యాచరణ తయారీకి ఈ శిక్షణ కార్యక్రమాలు జరుగుతున్నాయని వెల్లడించారు. ఈనెల 5,6వ తేదీల్లో పల్నాడు, 7,8వ తేదీల్లో గుంటూరు, బాపట్ల జిల్లాల పరిధిలోని మండలాలకు ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు జెడ్పీ సమావేశ మందిరంలో నిర్వహించే శిక్షణా కార్యక్రమాలకు అధికారులు, ఉద్యోగులు హాజరు కావాలని సూచించారు.

40,989 బస్తాల మిర్చి రాక

కొరిటెపాడు(గుంటూరు): మార్కెట్‌ యార్డుకు సోమవారం 40,989 మిర్చి బస్తాలు రాగా, గత నిల్వలతో కలిపి ఈ–నామ్‌ విధానం ద్వారా 35,381 బస్తాల అమ్మకాలు జరిగాయి. నాన్‌ ఏసీ కామన్‌ రకం 334, నంబర్‌–5, 273, 341, 4884, సూపర్‌–10 రకాల మిర్చి సగటు ధర రూ.8,000 నుంచి రూ. 16,000 వరకు పలికింది. నాన్‌ ఏసీ ప్రత్యేక రకం తేజ, బాడిగ, దేవనూరు డీలక్స్‌ రకాల మిర్చి సగటు ధర రూ.7,500 నుంచి 18,300 వరకు లభించింది. ఏసీ కామన్‌ రకం మిర్చి రూ. 8,500 నుంచి రూ. 17,000 వరకు లభించింది. ఏసీ ప్రత్యేక రకం రూ. 8,000 నుంచి రూ. 17,800 వరకు ధర పలికింది.

No comments yet. Be the first to comment!
Add a comment
స్వచ్ఛంద సంస్థలు   ప్రచారం చేపట్టాలి 
1
1/1

స్వచ్ఛంద సంస్థలు ప్రచారం చేపట్టాలి

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement