అంతర పంటలతో అధిక లాభాలు
బెల్లంకొండ: ప్రకృత్తి వ్యవసాయ విధానంలో అంతర పంటల సాగుతో అధిక దిగుబడులు సాధించవచ్చని జిల్లా ప్రాజెక్టు మేనేజర్ కె.అమలకుమారి తెలిపారు. మంగళవారం మండలంలోని న్యూ చిట్యాల, నాగిరెడ్డిపాలెం గ్రామాలలో కంది, మిర్చి ప్రకృతి వ్యవసాయ క్షేత్రాలను స్టేట్ రిసోర్స్ పర్సన్ రామచంద్రన్‌తో కలసి సందర్శంచారు. ఆమె మాట్లాడుతూ కందిలో అంతర పంటలుగా గోరు చిక్కుడు, సజ్జ, దోస, అలసంద, పెసర పంటలు, రక్షక పంటగా జొన్న వేయడం జరిగిందన్నారు. ఈ విధానం వలన కంది పంటను ఆశించే పురుగు తెగుళ్లు ఉధృతి తక్కువగా ఉంటుందన్నారు. అంతర పంటల ద్వారా ఇప్పటివరకు రూ.3వేలు ఆదాయం వచ్చిందని రైతులు తెలిపారు. భూమి పంటలతో కప్పించడం ద్వారా కలుపు నివారణ సాధ్యమవుతుందని, అన్ని రకాల పంటలు వేయడంతో భూమి సారవంతమవుతుందని తెలిపారు. కంది పంట వేసే ప్రతి రైతు ప్రకృతి వ్యవసాయ విధానాలు ఆచరించడం ద్వారా నికర ఆదాయం పెరుగుతుందని అంతర పంటల ద్వారా ప్రధాన పంటకు అయ్యే ఖర్చు తగ్గించవచ్చని అన్నారు. మిర్చిలో ప్రకృతి వ్యవసాయ విధానంలో అంతర పంటలుగా ముల్లంగి, బంతి, కొత్తిమీర వేయడం ద్వారా ప్రధానంగా ఈ పంటల నుండి వచ్చే ఘాటైన వాసనకు మిరపలో వచ్చే తామర పురుగు ఉధృతి తగ్గుతుందని, రైతుకి అదనపు ఆదాయం చేయకూరుతుందని తెలియజేశారు. కార్యక్రమంలో మండల వ్యవసాయాధికారి కృష్ణయ్య, సిబ్బంది సైదయ్య, నందకుమార్, అనంతలక్ష్మి, అంజలి, నరసింహారావు, మాధవి, రైతులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment