పవన్‌ పర్యటనతో ట్రాఫిక్‌ ఆంక్షలు | - | Sakshi
Sakshi News home page

పవన్‌ పర్యటనతో ట్రాఫిక్‌ ఆంక్షలు

Published Wed, Nov 6 2024 2:25 AM | Last Updated on Wed, Nov 6 2024 2:25 AM

పవన్‌ పర్యటనతో ట్రాఫిక్‌ ఆంక్షలు

పవన్‌ పర్యటనతో ట్రాఫిక్‌ ఆంక్షలు

నరసరావుపేట: రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్‌ కల్యాణ్‌ పర్యటన కొద్దిసేపు స్థానిక ప్రజలను ఇబ్బందుల పాలు చేసింది. మల్లమ్మసెంటర్‌, గడియారం స్తంభం సెంటర్‌, శివునిబొమ్మ సెంటర్‌, పల్నాడు రోడ్లలో పోలీసులు ట్రాఫిక్‌ ఆంక్షలు అమలు చేశారు. వాహనదారులకు ట్రాఫిక్‌ బోర్డులు అడ్డుగా నిలబెట్టి ఎక్కడిక్కడ ఆపేశారు. మంగళవారం గురజాల నియోజకవర్గంలోని మాచవరం మండలంలో గల సరస్వతీ భూములను పరిశీలించేందుకు బయలుదేరిన పవన్‌ నరసరావుపేట పట్టణం గుండా గురజాలకు బయలుదేరి వెళ్లారు. ఆయన రాకను పురస్కరించుకొని స్వాగతం చెప్పేందుకు జనసేన వర్గీయులు పలు సెంటర్లకు భారీగా చేరుకున్నారు. ఎస్‌ఆర్‌కేటీ జంక్షన్‌తోపాటు పలు సెంటర్లలో భారీగా గుమికూడిన అభిమానులకు కారు నుంచి బయటకు వచ్చి అభివాదం చేశారు. పార్టీ రాష్ట్ర కార్యదర్శి, నియోజకవర్గ ఇన్‌చార్జి సయ్యద్‌ జిలాని మల్లమ్మసెంటర్‌లో కార్యకర్తల తోపులాట మధ్య పుష్పగుచ్ఛం అందజేయటంతో ఆయనతో పవన్‌ కరచాలనం చేశారు. పవన్‌ కాన్యాయ్‌ పట్టణం దాటడంతో ట్రాఫిక్‌ ఆంక్షలను సడలించి ప్రజలను రాకపోకలకు అనుమతి ఇచ్చారు. పోలీసులు ఊపిరి పీల్చుకున్నారు.

ఇబ్బందులు పడిన ప్రజలు

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement