చిలకలూరిపేటటౌన్/యడ్లపాడు: జవహర్ నవోదయ విద్యాలయంలో 9, 11వ తరగతుల్లో మిగిలిన ఉన్న 2025–26 విద్యా సంవత్సరం ప్రవేశానికి గడువు తేదీ పెంపుదల చేసినట్లు చిలకలూరిపేట మండలం మద్దిరాలలో గల పీఎం శ్రీ జవహర్ నవోదయ విద్యాలయం ప్రిన్సిపాల్ నల్లూరి నరసింహారావు తెలిపారు. ఈ ప్రవేశ పరీక్షలకు దరఖాస్తు చేసుకునేందుకు ఈనెల 9వ తేదీ తుది గడువు అన్నారు. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 2024–25 విద్యా సంవత్సరంలో 8వ తరగతి చదువుతూ 2010 మే ఒకటో తేదీ నుంచి 2012 జూలై 31 తేదీ మధ్య జన్మించిన విద్యార్థులు 9వ తరగతి ప్రవేశ పరీక్షకు దరఖాస్తు చేసుకోవచ్చని తెలిపారు. వీరికి హిందీ, ఇంగ్లీష్ గణితం, సైన్‌న్స్ సబ్జెక్టులో ఆబ్జెక్టు విధానంలో ప్రశ్నపత్రం ఇంగ్లీష్, హిందీ భాషల్లో ఉంటుందన్నారు. 2024–25 విద్యా సంవత్సరంలో పదో తరగతి చదువుతూ 2008 జూన్ ఒకటో తేదీ నుంచి 2010 జూలై 31వ తేదీ మధ్య జన్మించిన విద్యార్థులు 11వ తేదీ ప్రవేశ పరీక్షకు దరఖాస్తు చేసుకోవచ్చని చెప్పారు.
వీరికి ఇంగ్లీష్, గణితం, సైన్స్, సోషల్ సైన్స్, మెంటల్ ఎబిలిటీ సబ్జెక్టుల్లో ఓఎంఆర్ పద్ధతుల్లో పరీక్ష ఉంటుందన్నారు. వీరికి ఇంగ్లీషు, హిందీ భాషలో ప్రశ్నపత్రం ఉంటుందని వివరించారు. ఆయా ఖాళీల్లో ప్రవేశాలు పొందగోరే విద్యార్థులు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. 9వ తరగతి ప్రవేశ పరీక్షలకు cbreitmr.nic.in/2024/nvrin, 11వ తరగతి ప్రవేశ పరీక్షలకు cbreitmr.nic.in/2024/nvx-i11 వెబ్‌సైట్లను లాగిన్ కావాలన్నారు. మరిన్ని వివరాల కోసం కార్యాలయంలో సంప్రదించాలని సూచించారు.
9, 11 తరగతుల ఖాళీల భర్తీ ఈనెల 9వ తేదీ వరకు దరఖాస్తులకు అవకాశం
Comments
Please login to add a commentAdd a comment