అర్హులందరికీ సిలిండర్లు
తెనాలి రూరల్: రాష్ట్రంలో అర్హులైన ప్రతి ఒక్కరికి ఏడాదికి మూడు ఉచిత గ్యాస్ సిలిండర్లను అందజేస్తామని రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ అన్నారు. తెనాలి పట్టణంలోని యడ్ల లింగయ్య కాలనీ, బాలాజీరావుపేట ప్రాంతాల్లో మంగళవారం సాయంత్రం ఏర్పాటు చేసిన దీపం–2 పథకం ప్రారంభోత్సవంలో ఆయన పాల్గొన్నారు. లబ్ధిదారుల ఇళ్లకు వెళ్లి సిలిండర్లను పంపిణీ చేశారు. జిల్లా కలెక్టర్ నాగలక్ష్మి తదితరులు ఆయన వెంట ఉన్నారు. బాలాజీరావుపేట అయ్యప్ప స్వామి గుడి సమీపంలో పంపిణీ సందర్భంగా ఆయన గ్యాస్ పొయ్యిని వెలిగించగా.. లబ్ధిదారు మల్లవరపు శివమ్మ టీ కాచి మంత్రి, జిల్లా కలెక్టర్ సహా అధికారులకు అందజేశారు. కేవైసీ అందరూ చేసుకోవాలని మంత్రి సూచించారు. సబ్ కలెక్టర్ సంజనా సింహ, మున్సిపల్ కమిషనర్ బండి శేషన్న, తహసీల్దార్ కేవీ గోపాలకృష్ణ, డీఎస్వో కోమలి పద్మ, సీఎస్డీటీ మూర్తి, పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment