కానిస్టేబుళ్ల అభ్యర్థులకు దేహదారుఢ్య పరీక్షలు
తొలిరోజు అర్హత సాధించిన 166 మంది అభ్యర్ధులు
నగరంపాలెం: జిల్లా పోలీస్ పరేడ్ గ్రౌండ్స్‌లో పోలీస్ కానిస్టేబుళ్ల అభ్యర్థుల దేహదారుఢ్య పరీక్షలు సోమవారం మొదలయ్యాయి. తెల్లవారుజామున ఐదు గంటల నుంచి గ్రౌండ్స్‌లోకి అనుమతించడంతో, ఎటువంటి తోపులాట లేకుండా ఒకరి తర్వాత ఒకర్ని లోనికి పంపించారు. జిల్లా ఎస్పీ సతీష్‌కుమార్, పలువురు పోలీసు అధికారులు దగ్గరుండి ఏర్పాట్లను, దేహదారుఢ్య పరీక్షలను పర్యవేక్షించారు. తొలిరోజు దేహదారుఢ్య పరీక్షలకు 290 మంది అభ్యర్థులు హాజరయ్యారు. వారిలో 36 మందికి సంబంధిత ధ్రువపత్రాలు లేకపోవడంతో వెనుదిగారు. 290 మందిలో 36 మందిని అనర్హులుగా ప్రకటించగా, మిగతా 254 మందికి శరీర కొలత పరీక్షలు(పీఎంటీ) నిర్వహించారు. వీరిలో 39 మందికి ఛాతి, ఎత్తు కొలతలు సరిపోకపోవడంతో తిరస్కరించారు. 254 మందిలో 39 మంది అనర్హులు కాగా, 215 మందికి 1,600 మీటర్ల పరుగు పందెం నిర్వహించగా, పోటాపోటీగా పరుగెత్తారు. వీరిలో 32 మంది అనర్హులు కావడంతో మిగతా 183 మంది తదుపరి పరీక్షలకు అర్హత సాధించారు. 183 మందిలో ఒకరూ వైదొలగా, 182 మందికి 100 మీటర్ల పరుగు పందెం పోటీ నిర్వహించారు. వీరిలో 74 మంది అర్హత సాధించగా, 108 మంది అనర్హత పొందారు. 183 మందికి లాంగ్ జంప్ నిర్వహించగా, వారిలో 166 మంది అర్హత సాధించగా, 17 మంది అనర్హత పొందారు. 254 మంది అభ్యర్థులకు దేహదారుఢ్య పరీక్షలు నిర్వహించగా వారిలో 166 మంది అర్హత సాధించగా, 88 మంది అనర్హత పొందారు.
Comments
Please login to add a commentAdd a comment