నరసరావుపేట: జిల్లా ప్రజలు నూతన సంవత్సరాన్ని ఆనందోత్సవాలు, వేడుకల మధ్య స్వాగతించారు. మంగళవారం అర్ధరాత్రి నుంచే జిల్లా వ్యాప్తంగా జోష్ నెలకొంది. ప్రజలు తమ ఇష్టదైవాల ఆలయాలకు వెళ్లి ప్రార్థనలు, పూజలు చేశారు. రాష్ట్ర ప్రభుత్వం అర్ధరాత్రి వరకు మద్యం విక్రయాలకు అనుమతి ఇవ్వటంతో బార్ అండ్ రెస్టారెంట్లు కిటకిటలాడాయి. రాత్రి 12గంటలు కాగానే యువత రోడ్లపైకి వచ్చి బాణసంచా కాల్చారు. మరికొందరు రోడ్లపైనే కేకులు కట్‌చేసి ఆనందోత్సవాలు జరుపుకున్నారు అర్ధరాత్రి వరకు ద్విచక్రవాహనాలపై యువకులు కేరింతలు కొడుతూ హల్‌చల్ చేశారు.
నాయకుల ఇళ్లు, కార్యాలయాల వద్ద సందడి
సత్తెనపల్లికి చెందిన వైఎస్సార్‌సీపీ నాయకులు గుంటూరు వెళ్లి మాజీ మంత్రి అంబటి రాంబాబు గృహంలో ఆయనతో కేకు కట్ చేయించి శుభాకాంక్షలు తెలిపారు. చిలకలూరిపేట నియోజకవర్గంలో ఎమ్మెల్సీ మర్రి రాజశేఖర్ గృహంలో వేడుకలు నిర్వహించారు. గురజాల నియోజకవర్గం పిడుగురాళ్లలో మాజీ ఎమ్మెల్యే కాసు మహేష్‌రెడ్డి కార్యాలయంలో వేడుకలు నిర్వహించారు. కేక్ కట్ చేసి కార్యకర్తలకు పంచారు. నరసరావుపేటలోని కాసు కృష్ణారెడ్డి గృహంలోనూ వేడుకలు జరిగాయి. పెదకూరపాడు నియోజకవర్గంలోని పలు ఎస్సీ కాలనీల్లో పార్టీ నాయకులు మాజీ సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఫొటోలు ఏర్పాటుచేసి వాటి ముందు కేకులు కట్‌చేసి కొత్త సంవత్సర శుభాకాంక్షలు తెలియజేశారు. పల్నాడు జిల్లా వ్యాప్తంగా ప్రధాన ఆలయాలు కొత్తసంవత్సరం సందర్భంగా కిటకిటలాడాయి. చర్చిల్లో మంగళవారం అర్ధరాత్రి ప్రత్యేక ప్రార్థనలు జరిగాయి.
నవోత్సాహం
ఉత్సాహంగా కొత్త సంవత్సర వేడుకలు అర్ధరాత్రి వరకు కిటకిటలాడిన బార్లు, రెస్టారెంట్లు బాణసంచా కాల్చి నడిరోడ్లపైనే కేకులు కట్‌చేసిన యువకులు రాజకీయ నేతల ఇళ్ల వద్ద అభిమానుల సందడి ఆలయాల్లో ప్రత్యేక పూజలు, ప్రార్థనలు
Comments
Please login to add a commentAdd a comment