జీజీహెచ్‌లో రూ.18 కోట్లతో పెట్ సిటీ
గుంటూరు మెడికల్: క్యాన్సర్ రోగులకు శుభవార్త. క్యాన్సర్‌ను ప్రాథమిక దశలోనే గుర్తించేందుకు అత్యంత ఖరీదైన, కీలకమైన అత్యాధునిక వైద్య పరికరం గుంటూరు జీజీహెచ్‌లో అందుబాటులోకి రానుంది. గుంటూరు ప్రభుత్వ సమగ్ర వైద్యశాలలోని నాట్కో క్యాన్సర్ సెంటర్‌లో సుమారు రూ.18 కోట్లు వెచ్చించి ఏర్పాటు చేయనున్న జీఈ కంపెనీ పెట్ సిటి పరికరం ఏర్పాటుకు సంబంధించి టర్న్ కీ పనులకు శుక్రవారం ప్రారంభ పూజ నిర్వహించారు. జీజీహెచ్ సూపరింటెండెంట్ డాక్టర్ యశశ్వి రమణ కొబ్బరి కాయ కొట్టి పూజ చేశారు. నాట్కో సమన్వయకర్త యడ్లపాటి అశోక్‌కుమార్, డెప్యూటీ సూపరింటెండెంట్ డాక్టర్ గిరిజవోలు దుర్గాప్రసాద్, నర్సింగ్ సూపరింటెండెంట్ గ్రేడ్–2 ఆవుల విజయ, జీఈ ప్రతినిధులు, నాట్కో క్యాన్సర్ సెంటర్ వైద్యులు, నర్సులు, సిబ్బంది పాల్గొన్నారు. క్యాన్సర్ రోగులకు రాబోవు ఉగాది నాటికి పెట్ సిటి అందుబాటు లోకి రావచ్చని సూపరింటెండెంట్ తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment