మహిళా ఉపాధ్యాయ దినోత్సవంగా ప్రకటించాలి
పొన్నూరు: దేశంలో సీ్త్ర విద్యా విప్లవాన్ని ప్రారంభించిన సాంస్కృతిక యోధురాలు సావిత్రిబాయి పూలే జయంతిని రాష్ట్ర మహిళా ఉపాధ్యాయ దినోత్సవంగా ప్రకటించాలని దళిత మహాసభ వ్యవస్థాపక ప్రధాన కార్యదర్శి, కవి డాక్టర్ కత్తి పద్మారావు అన్నారు. శుక్రవారం లుంబినీవనంలోని అంబేడ్కర్ రీసెర్చ్ సెంటర్‌లో సావిత్రిబాయి పూలే జయంతి నిర్వహించారు. కత్తి పద్మారావు, మాతా రమాబాయి అవార్డు గ్రహీత కత్తి స్వర్ణకుమారి, రీసెర్చ్ సెంటర్ సభ్యురాలు దాసరి శ్యామల, కట్టా సృజన, గేరా ప్రసన్న, రాణి, శాంతి, హేమ, మాధవ్, అక్కిదాసు జాషువా, షబ్బీర్ అలీ, పాల్గొన్నారు. లుంబినీవనంలో సావిత్రిబాయి పూలే విగ్రహానికి పూలమాలతో నివాళులర్పించారు. అనంతరం జరిగిన సభలో కత్తి పద్మారావు మాట్లాడుతూ.. మహిళా ఉపాధ్యాయ దినోత్సవంగా ప్రకటించాలని రాష్ట్ర ప్రభుత్వంపై ముప్‌పై ఏళ్లుగా పోరాడుతున్నామని అన్నారు. ఈ మేరకు తెలంగాణ ప్రకటించడం హర్షణీయమన్నారు. సావిత్రిబాయి పూలే జీవిత చరిత్రను 6వ తరగతి నుంచి ఎంఏ వరకు పాఠ్యాంశంగా పెట్టాలని డిమాండ్ చేశారు. ప్రతి స్కూల్లో ఆమె చిత్రపటాలు, విగ్రహాలను ఆవిష్కరించాలని కోరారు. రెండు రాష్ట్రాలలో ఆమె పేరిట మహిళా విశ్వ విద్యాలయాలను నెలకొల్పాలని అన్నారు.
కవి డాక్టర్
కత్తి పద్మారావు
Comments
Please login to add a commentAdd a comment