చదువుకునేందుకు వచ్చి..
ఈతకు వెళ్ళి గుంటూరు బ్రాంచ్ కెనాల్ కాలువలో మృతి చెందిన పొదిలి చరణ్‌ది యడ్లపాడు మండలం లింగారావుపాలెం గ్రామం. పొదిలి భాస్కర్, కృష్ణకుమారి దంపతులకు ఇద్దరు కుమారులు. చిన్న కుమారుడు పొదిలి చరణ్‌ను సత్తెనపల్లి రాజుపాలకాలనీలో లస్కర్‌గా పని చేస్తున్న తాతయ్య రాచకొండ జగన్నాథం వద్ద ఉంచారు. రెండేళ్ల నుంచి చరణ్ ఇక్కడే ఉంటూ ప్రైవేటు పాఠశాలలో తొమ్మిదో తరగతి చదువుతున్నాడు. సరదాగా స్నేహితులతో ఈతకు వెళ్లి కాలువలో గల్లంతై మరణించాడు. దీంతో అతని తల్లిదండ్రులు, బంధువులు కన్నీరు మున్నీరుగా విలపించారు. చదువుకునేందుకు వచ్చి విగతజీవిగా మారావా అంటూ రోదించారు.
Comments
Please login to add a commentAdd a comment