పాఠశాల బస్సును ఢీకొట్టిన లారీ
కొల్లూరు: అతి వేగంగా దూసుకొచ్చిన లారీ ఓ పాఠశాల బస్సును ఢీకొట్టిన సంఘటన మంగళవారం చోటుచేసుకుంది. స్థానికుల కథనం మేరకు.. కొల్లూరులోని శ్రీ సాయి వాసవి విద్యా సంస్థలకు చెందిన స్కూల్ బస్సు మండలంలోని క్రాప నుంచి కొల్లూరు వస్తుంది. కొల్లూరు శివారు బోసునగర్ వద్ద విద్యార్థులను ఎక్కించుకునేందుకు డ్రైవర్ బస్సును రోడ్డు పక్కన నిలిపాడు. అదే మార్గంలో తెనాలి నుంచి ఇటుకరాయి కార్మికులను ఎక్కించుకొని వస్తున్న లారీ ఈ బస్సును వెనుక నుంచి ఢీకొంది. విద్యార్థులు ఎం.కౌషిక్, కె.సంపత్ నాయక్, ఎం.జస్వంత్ సాయి, వై.దుర్గ, డి.ప్రేమ్‌కుమార్, టీచర్ బి.వెంకటపద్మలకు స్వల్ప గాయాలయ్యాయి.
Comments
Please login to add a commentAdd a comment