రైళ్ల రాకపోకలు పునరుద్ధరణ
దాచేపల్లి: పల్నాడు జిల్లా పొందుగల రైల్వేస్టేషన్ సమీపంలో గూడ్స్‌రైలు పట్టాలు తప్పటంతో మరమ్మతులు శరవేగంగా జరిగాయి. మంగళవారం తెల్లవారుజామున 3.30 గంటల నుంచే రైళ్లు యథావిధిగా రాకపోకలు సాగించేలా రైల్వే అధికారులు చర్యలు చేపట్టారు. వివరాలు... పొందుగల రైల్వేస్టేషన్ సమీపంలో విష్ణుపురం నుంచి నడికుడికి వస్తున్న గూడ్స్ రైలులోని వ్యాగన్ పట్టాలు తప్పింది. లోకో పైలెట్ నడికుడి రైల్వేస్టేషన్ అధికారులకు సమాచారం అందించారు. అధికారులు సంఘటన స్థలానికి చేరుకున్నారు. వ్యాగన్‌కి మరమ్మతులు చేయించారు. దాదాపు 4 గంటల పాటు సిబ్బంది శ్రమించి ట్రాక్‌పై రాకపోకలు సాగేలా పనులు పూర్తి చేశారు. మొదటిగా నర్సాపుర్ ఎక్స్‌ప్రెస్‌ను పంపించారు. తరువాత మరోసారి ట్రాక్ పరిశీలించి అన్ని రైళ్ల రాకపోకలకు అనుమతులు ఇచ్చారు. గూడ్స్‌రైలులోని వ్యాగన్ పట్టాలు తప్పటంతో నారాయణాద్రి ఎక్స్‌ప్రెస్‌ని మాత్రమే తెనాలి మీదుగా విజయవాడ నుంచి సికింద్రాబాద్‌కు దారి మళ్లించారు. డెల్టా, విశాఖ రైలు ఆలస్యంగా నడిచాయి. ఘటన జరిగిన వెంటనే డీఆర్‌ఎం రామకృష్ణ చేరుకుని ట్రాక్ పునరుద్ధరణ పనులను పర్యవేక్షించారు. ప్రమాదానికి కారణాలపై ఆరా తీశారు.
యుద్ధ ప్రాతిపదికన గూడ్స్
వ్యాగన్‌కు, ట్రాక్‌కు మరమ్మతులు
పొందుగల మీదుగా
యథావిధిగా రైళ్లు
Comments
Please login to add a commentAdd a comment