11న అమరేశ్వరునికి అన్నాభిషేకం | - | Sakshi
Sakshi News home page

11న అమరేశ్వరునికి అన్నాభిషేకం

Published Wed, Jan 8 2025 1:56 AM | Last Updated on Wed, Jan 8 2025 1:56 AM

11న అమరేశ్వరునికి అన్నాభిషేకం

11న అమరేశ్వరునికి అన్నాభిషేకం

అమరావతి: ప్రఖ్యాత పుణ్యక్షేత్రం అమరావతిలో వేంచేసియున్న శ్రీబాల చాముండికా సమేత అమరేశ్వరునికి ఈ నెల 11వ తేదీన మహన్యాస పూర్వక ఏకాదశ రుద్ర అన్నాభిషేకాన్ని నిర్వహించనున్నారు. ఈ మేరకు ఆలయ ఈవో సునీల్‌కుమార్‌ మంగళవారం తెలిపారు. ఆయన మాట్లాడుతూ.. ధనుర్మాసంలో స్వామి వారి జన్మనక్షత్రమైన ఆరుద్ర నక్షత్రం సందర్భంగా దాతల సహకారంతో సుమారు రెండు క్వింటాళ్ల అన్నంతో స్వామి వారికి అభిషేకం నిర్వహిస్తారన్నారు. ఈ సందర్బంగా అమ్మవారికి ప్రత్యేక కుంకుమార్చనలు ఉంటాయని చెప్పారు. ఈ కార్యక్రమాలలో భక్తులు పెద్దసంఖ్యలో పాల్గొనాలని ఆయన కోరారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement